Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యకుమార్‌ను వెక్కిరించిన కోహ్లీ!.. నవ్వులే నవ్వులు (వీడియో వైరల్)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో బ్యాట్ తో ఎంత సీరియస్ గా కనిపిస్తాడో.. అంతే సరదాగా కూడా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన చర్యలతో కామెడీ చేస్తూ ఫ్యాన్స్ ను తెగ నవ్విస్తుంటాడు. డ్యాన్సింగ్ చేయడం, సరదాగా ఇమిటేట్ చేయడం వంటివి చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం అతడు ఫామ్ లో లేనప్పటికీ.. డ్రెసింగ్ రూమ్ లో తన వంతుగా ఫన్నీ అండ్ హెల్తీ అట్మాస్పియర్ బానే మెయిన్ టెయిన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విరాట్ కోహ్లీ నవ్వులు పూయించాడు. రెండో వన్డేలో తన సీట్ లో కూర్చొన్న విరాట్ లేచి నిలబడి మరీ.. అచ్చం సూర్య కుమార్ యాదవ్ ను ఇమిటేట్ చేస్తూ పొట్ట చక్కలయ్యేలా నవ్వించాడు. సాధారణంగా సూర్య కుమార్ యాదవ్.. క్రీజులో ఉన్నప్పుడు ఎక్కువగా చీవింగ్ గమ్ నమలుతున్నట్లు కనిపిస్తుంటాడు. ఆ విధంగానే కోహ్లీ.. తన నోరు పెద్దగా తెరిచి పళ్లు బయటపెట్టి నములుతున్నట్లు హిలారియస్ కామెడీ చేశాడు. ముఖ్యంగా తన ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో ఫన్నీ అట్మాస్పియర్ ను క్రియేట్ చేశాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ భారత్ ఇన్నింగ్స్ సమయంలో జరిగింది. అప్పుడు కోహ్లీతో పాటు గిల్, రషభ్ పంత్, అర్షదీప్ సింగ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పుల్ గా నవ్వుకుంటూ తెగ షేర్ చేస్తున్నారు.

Virat Kohli Imitates Suryakumar Yadav s Signature Chewing Gum Style in ind vs eng 2nd ODI

రీసెంట్ గా సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను 4-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది. ఇది సూర్య కుమార్ యాదవ్ కు కప్టెన్ గా వరుసగో నాలుగు సిరీస్ విజయం. శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాపై సిరీస్ విజయాల్ని అందుకున్నాడు. కానీ బ్యాటర్ గా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయట్లేదు.

Story first published: Monday, February 10, 2025, 15:19 [IST]
Other articles published on Feb 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+