Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్ ఖాన్ స్నేక్ షాట్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లీ.. ఆ షాట్ రహస్యం ఏంటో చెప్పిన రషీద్

గుజరాత్ టైటాన్స్‌కు స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఆఫ్ఘనిస్థానీ స్టార్ ఈ సీజన్‌లో 6.87ఎకానమీ రేట్‌తో ఇప్పటివరకు 16వికెట్లు తీశాడు. అతను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల(పర్పుల్ క్యాప్) రేసులో లేకపోయినప్పటికీ చాలా మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ చేశాడు. ఇకపోతే ఈ సీజన్లో తన పాత టీం అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 11బంతుల్లో 31నాటౌట్ పరుగులతో మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. గత రెండేళ్లుగా తన బ్యాటింగ్‌పై మంచి కసరత్తు చేస్తున్న రషీద్.. స్నేక్ షాట్‌లు అని పిలిచే షాట్లు ఆడుతూ తన స్ట్రోక్-ప్లేతో అలరిస్తున్నాడు. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్లో కలిశారు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్‌లో రషీద్ స్నేక్‌షాట్‌ను విరాట్ కోహ్లీ ఇమిటేట్ చేశాడు. ఈ వీడియోను రషీద్ ఖాన్ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశాడు.

భాయిసాబ్ షాట్ మార్తే

భాయిసాబ్ షాట్ మార్తే

'యే భాయిసాబ్ అలాగ్ హై ఖేల్తే హైన్. గన్ షాట్ మార్తే హై' అని కోహ్లీ, రషీద్ నవ్వుకుంటూ ఈ వీడియోలో సంభాషించుకున్నారు. ఇకపోతే తన స్నేక్ షాట్ గురించి ఇవెన్ విరాట్ కోహ్లీకి కూడా తెలుసు అంటూ ఫన్నీగా ఆ వీడియోకు రషీద్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ గుజరాత్ టైటాన్స్‌కు అపురూప విజయాన్నందించాడు. మార్కో జాన్సెన్ వేసిన చివరి ఓవర్లో రషీద్ నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాది అద్వితీయ విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి 196 పరుగులు చేయాల్సిన తరుణంలో గుజరాత్ టైటాన్స్ 140కి 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాహుల్ తెవాతియా (40)తో కలిసి రషీద్ (31) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరు కలిసి 24బంతుల్లో 59పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఎందుకు స్నేక్ షాట్ అని పిలుస్తానంటే?

ఎందుకు స్నేక్ షాట్ అని పిలుస్తానంటే?

'నేను హిట్టింగ్ చేసే క్రమంలో బాదే షాట్‌ను స్నేక్ షాట్ అని పేర్కొంటాను. ఎందుకంటే పాము ఎవరినైనా కాటేస్తే అది ఒక్కసారి వెనక్కి వెళ్లి బుస కొడుతూ ముందుకు వేగంగా వచ్చి కాటేస్తుంది. అలాగే నేను కూడా బంతి నేరుగా దూసుకొస్తున్నప్పుడు వెనక్కి వంగి బలం పుంజుకుని ముందుకొచ్చి హిట్టింగ్ చేస్తా. అలా చేయకపోతే ఆ షాట్ కొట్టడానికి నాకు తగినంత ఎనర్జీ అందదు. నేను నార్మల్ గా ఉండి ప్రయత్నిస్తే సిక్సర్ కొట్టేంత శక్తి రాదు. అందుకే నేను అలా షాట్ కొడతాను. ఈ షాట్ కోసం నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. అలాగే నా మణికట్టును బలోపేతం చేసుకున్నా' అని రషీద్ ఖాన్ మ్యాచ్ అనంతరం టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి చెప్పాడు. ఈ వీడియో ట్విట్టరులో పోస్ట్ అయింది.

 నేటి మ్యాచ్ ఆర్సీబీకి చావో రేవో

నేటి మ్యాచ్ ఆర్సీబీకి చావో రేవో

గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్‌ ఆడుతున్నప్పటికీ ఈ సీజన్లో అత్యుత్తమ జట్టుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 13 గేమ్‌లలో 20పాయింట్లు సాధించిన గుజరాత్ ఇప్పటికే లీగ్ స్టాండింగ్‌లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు బెంగళూరు ఈ సీజన్‌లో ఏడు విజయాలు, ఆరు ఓటములను నమోదు చేసి 13మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీకి నేడు జరగబోయే మ్యాచ్ చావో రేవో లాంటిది.

Story first published: Thursday, May 19, 2022, 18:13 [IST]
Other articles published on May 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+