Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీని గెలికి అడ్డంగా బుక్కైన ట్రావిస్ హెడ్! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇది చివరి మ్యాచ్ కాగా.. పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని దక్కుంచుకోవడం కోసం ఇరు జట్లు విజయం కోసం శాయశక్తులా పోరాడాయి. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించినప్పటికీ.. రన్ రేట్ సమీకరణాల వల్ల టాప్-2లోకి రాలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో జరిగిన ఓ ఊహించని సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఓ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఆయనపై స్లెడ్జింగ్‌కు దిగాడు. సాధారణంగా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడం కొత్తేమీ కాదు. కానీ అవతలి వైపు ఉన్నది విరాట్ కోహ్లీ అనే విషయాన్ని ట్రావిస్ హెడ్ మర్చిపోయినట్టు ఉన్నాడు. విరాట్ కోహ్లీకి ఉన్న అగ్రెసివ్ మైండ్‌సెట్ ప్రకారం ఆయన మైదానంలో ఇటువంటి వాటిని అస్సలు సహించడు. స్లెడ్జింగ్ జరిగిన సమయంలోనే ఇద్దరి మధ్య కాస్త మాటల యుద్ధం నడిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అంతా మామూలైపోతుందని ట్రావిస్ హెడ్ భావించాడు.

Virat Kohli Ignores Travis Head Handshake After SRH vs RCB IPL 2026 Match Video Goes Viral

షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ!
పోటీ ముగిసిన అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు ఒకరికొకరు కరచాలనం(షేక్ హ్యాండ్) చేసుకునే సాంప్రదాయం ప్రకారం లైన్లో వచ్చారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ వైపు నవ్వుతూ చేతిని చాచాడు. కానీ కోహ్లీ మాత్రం ట్రావిస్ హెడ్‌పై ఉన్న తీవ్ర అసంతృప్తి, కోపాన్ని స్పష్టంగా చూపిస్తూ.. హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దాటవేశాడు. హెడ్‌ను దాటుకుని వెనుక ఉన్న ఇషాన్ కిషన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు సాగిపోయాడు. కింగ్ కోహ్లీ చేసిన ఈ పనితో ఒక్కసారిగా షాక్‌‌కు గురైన ట్రావిస్ హెడ్ ముఖం చిన్నబోయింది. స్టేడియంలో తనకు జరిగిన ఈ ఘోర అవమానంతో హెడ్ నీరసించిపోయాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్.. అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56), ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79), హెన్రిచ్ క్లాసెన్ (51)ల ధనాధన్ హాఫ్ సెంచరీల సాయంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెడ్ 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. వెంకటేష్ అయ్యర్ (44), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41) రాణించినప్పటికీ లక్ష్యాన్ని చేరలేకపోయింది. విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టాప్-2 లోకి వెళ్లాలంటే ఆర్సీబీని 166 పరుగుల లోపే నిలువరించాల్సి ఉండగా.. ఆర్సీబీ ఆ స్కోరును దాటేయడంతో హైదరాబాద్ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.

Story first published: Saturday, May 23, 2026, 8:54 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+