Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలా ఆడితే విజయానికి అర్హులం కాదు: కోహ్లీ ఉద్వేగం

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వేదిగా ఆదివారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 27 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సొంత మైదానంలో ఓడిపోవడం పట్ల విరాట్‌ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

స్కోరు కార్డు

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు. చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్‌‌లో తమ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం శోచనీయమని కోహ్లీ అన్నాడు. ఇలా ఆడితే విజయానికి తాము అర్హులం కాదని తేల్చి చెప్పాడు.

Virat Kohli: ‘If we play like this, we don’t deserve to win’

'ఈ ఉద్వేగాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. డెత్ ఓవర్లలో మా బౌలర్లు బౌలింగ్ సరిగా చేయలేదు. నిజానికి గత మ్యాచ్‌ చాలా బాగా ఆడాం. కానీ ఈరోజు మ్యాచ్‌‌లో బాగా ఆడలేకపోయాం. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా' అని కోహ్లీ అన్నాడు.

ఇలా ఆడితే మేము గెలవలేముం. మేము నిలకడగా, బాగా ఆడాల్సిన అవసరముంది. పుణె టీమ్‌ మాకంటే బాగా ఆడి గెలిచింది' అని కోహ్లీ అన్నాడు. ఆర్సీబీ బౌలర్లు మరింత మెరుడుపడాల్సిన అవసరముందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. గతేడాది బాగా ఆడామని ప్రతిసారి అదేవిధంగా ఆడడం సాధ్యం కాదని కోహ్లీ చెప్పాడు.

పూణె నిర్దేశించిన 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లు ఆడి 9 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరుపై పూణె 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+