ఎవరండీ ఈ లక్కీ గర్ల్?.. ఎయిర్ పోర్టులో మహిళకు హగ్ ఇచ్చిన కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసే ఉంటుంది. అతడు ఫామ్ లో లేనప్పటికీ.. అతడి ఆట చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలో స్టేడియానికి తరలి వస్తున్నారు. అతడితో కలిసి ఫొటో దిగేందుకు, కనీసం షేక్ హ్యాండ్ అయిన ఇచ్చేందుకు ఎగబడుతున్నారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ.. స్వయంగా ఓ మహిళ దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చాడు. ఇప్పుడీ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె ఎవరో తెలుకునేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు.
ఇంతకీ ఆమె ఎవరంటే?
ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ఆడటం కోసం టీమిండియా సిద్ధం అవుతోంది. ఇందుకోసం అహ్మదాబాద్ బయలుదేరడానికి భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. అక్కడే ఎయిర్ పోర్టులో చెకింగ్ ఏరియాకు ముందు కొంత మంది అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు వచ్చారు. అదే సమయంలో కోహ్లీ గుంపులో ఉన్న ఓ మహిళను చూసి నవ్వాడు. నవ్వుతూనే ఆమె దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు. అప్పుడే మిగతా వారు కూడా విరాట్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. సెక్యురిటీ వాళ్లు కలగజేసుకొని కోహ్లీని అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ మహిళ ఎవరు?, ఆమెకే ఎందుకు హగ్ ఇచ్చాడు? అని తెగ ఆరా తీస్తున్నారు. అయితే, సదరు మహిళ కోహ్లీకి దగ్గరి బంధువు అని సమచారం అందింది. అందుకే దగ్గరికి వెళ్లి మహీ ఆమెను హత్తుకున్నాడని తెలిసింది.
Virat Kohli met a lady (close relative) at Bhubaneswar airport🥹❤️ pic.twitter.com/r71Du0Uccf
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) February 10, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications