For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఏదేమైనా 4-1 కాంబినేషన్‌ను పాటిస్తాం: విరాట్ కోహ్లీ

Virat Kohli Hints At India Persisting With 4 Seamer and 1 Spinner Tempalte In The Upcoming Tests

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా మిగతా మ్యాచ్‌ల్లోనూ 4-1 కాంబినేషన్‌ పాటిస్తుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్టు రద్దు అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ప్రతి మ్యాచ్‌లోనూ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌ను తీసుకుంటామని స్పష్టం చేశాడు. అదే నిజమైతే ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. తొలి టెస్టులో జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

'ఈ మ్యాచ్‌లో వర్షం మూడు, నాలుగు రోజుల్లో పడుతుందని మేం ఆశించాం. కానీ అది ఐదో రోజున కూడా పడింది. చివరి రోజు ఆట జరిగి జరిగితే ఎంతో బాగుండేది. కానీ అలా జరగలేదు. బాధగా ఉంది. అలాగే మేం మ్యాచ్‌లో బలమైన ఓపెనింగ్‌ చేయాలనే అనుకున్నాం. దాంతో ఐదోరోజు మాకు విజయావకాశాలు ఉంటాయని భావించాం. ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి మ్యాచ్‌పై పట్టు సాధించామని అనుకున్నాం. మేం తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం అలా సాధిస్తామని అనుకున్నాం. కానీ అది 95 పరుగులకు చేరింది. ఆ లీడ్‌ మాకెంతో కీలకమైనా చివరి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడం బాధాకరం' అని విరాట్ కోహ్లీ విచారం వ్యక్తం చేశాడు.

చివరి రోజు భారత్ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌటవ్వడంతో భారత్‌ లక్ష్యం 209 పరుగులుగా నమోదైంది. నాలుగో రోజు మూడో సెషన్‌లో ఛేదనకు దిగిన భారతి శనివారం ఆట నిలిచిపోయేసరికి 52/1తో నిలిచింది. లోకేష్ రాహుల్‌ (26) ఔటైనా రోహిత్ రోహిత్‌ (12),చేతేశ్వర్ పుజారా(12) నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే చివరి రోజు భారత్‌ మరో 157 పరుగులు చేయాల్సి ఉంది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో ఆదివారం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది.

ఇంగ్లండ్ శనివారం రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ జో రూట్‌ (109; 172 బంతుల్లో 14x4)శతకంతో చెలరేగాడు. మరోవైపు భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. =అనంతరం భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 52/1తో నిలిచింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (26; 38 బంతుల్లో 6x4) ఔటైనా రోహిత్‌ శర్మ (12; 34 బంతుల్లో), చెతేశ్వర్‌ పుజారా (12; 13 బంతుల్లో 3x4) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు.

ఇక చివరి రోజు భారత విజయానికి 157 పరుగులే అవసరమైనా వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 183 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ రూట్‌ (64; 108 బంతుల్లో 4x4) అర్ధ శతకంతో రాణించాడు. ఆపై భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆడగా 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (84; 214 బంతుల్లో 12x4), రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లిష్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు, అండర్సన్‌ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

Story first published: Sunday, August 8, 2021, 23:24 [IST]
Other articles published on Aug 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+