ఎంత ప్రతిభావంతులో: కుల్దీప్, చాహల్‌పై కోహ్లీ ప్రశంసలు
హైదరాబాద్: భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ జట్టు విజయంలో వీరిద్దరిపై పాత్రపై ప్రముఖంగా కొనియాడాడు.

ఇద్దరూ ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశారు
‘ఇద్దరు యువ ఆటగాళ్లు ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌలింగ్‌లో క్వాలిటీ ఉంది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా వీరి సేవలను జట్టు ఉపయోగించుకుంటుంది. వరల్డ్ కప్ రేసులో 20-25 మంది ఆటగాళ్లలో పోటీ నెలకొని ఉంటుందని నేను ఇంతకుముందే చెప్పా' అని కోహ్లీ తెలిపాడు.

భువీ కూడా మంచి ప్రదర్శన
'రెండో వన్డేతో కుల్దీప్, చాహల్‌లు ఎంత ప్రతిభావంతులో అందరికీ తెలిసింది. భువీ కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఆదిలో ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఇది ఎంతగానో కలిసొచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కంగారూలను ఆదిలోనే దెబ్బతీయాలని అనుకున్నాం. తొలి 10 ఓవర్లలోనే వికెట్లు తీయాలనుకున్నాం. అదే జరిగింది' అని కోహ్లీ తెలిపాడు.

పాండ్యా ఒక్కడే ఆల్ రౌండర్ కాదు
'ఆల్ రౌండర్లలో జాబితాలో కూడా పోటీ నెలకొని ఉంది. పాండ్యా ఒక్కడే ఆల్ రౌండర్ కాదు. రవీంద్ర జడేజా, అక్షర పటేల్‌లాంటి స్పిన్నర్లతో కూడిన ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. కాబట్టి 2019 వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యే జట్టు కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

నా నుంచి నేనే స్ఫూర్తి పొందుతున్నా
ఇక రెండో వన్డేలో తన బ్యాటింగ్ గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు. 'మైదానంలో ఎక్కువ సేపు నిలదొక్కుకోవాలనున్నాను. నా నుంచి నేనే స్ఫూర్తి పొందేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. చెన్నై పిచ్‌కి ఈ పిచ్‌కి చాలా వ్యత్యాసం ఉంది' అని కోహ్లీ అన్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈ ఆదివారం ఇండోర్‌లో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications