స్విట్జర్లాండ్‌లో విరుష్క విహారం.. ముంబైలో రోహిత్ !!

స్విట్జర్లాండ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొంచెం సమయం దొరికినా తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సరదా సమయం గడుపుతుంటాడు. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌ను విజయవంతంగా ఘనంగా ముగించిన కోహ్లీ.. అనుష్క శర్మతో కలిసి మంచు కొండల్లో విహరిస్తున్నాడు. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తూ అనుష్క ప్రేమలో మునిగితేలుతున్నాడు. నూతన సంవత్సరం సంబరాలను చేసుకోవడానికి విరుష్క జోడి స్విట్జర్లాండ్‌లోని జిస్టాద్‌కు వెళ్లారు.
స్విట్జర్లాండ్‌లోని మంచు కొండల్లో విరుష్క జోడి చక్కర్లు కొట్టింది. మంచుతో కప్పబడిన ఆ కొండల్లో విరాట్-అనుష్కలు సరదా సరదాగా గడిపారు. ఈ విహార యాత్రకు సంబందించినం పోటోలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అభిమానులు లైక్‌లు కొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
త్వరలోనే భారత్‌కు రానుంది. శ్రీలంకతో, ఆసీస్‌లతో వరుసగా పరిమిత ఓవర్ల సిరీస్ ఉండటంతో కోహ్లి మళ్లీ బిజీ కానున్నాడు. కోహ్లీతో పాటు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. హిట్‌మ్యాన్ తమ కుటుంబంతో కలిసి ముంబయిలోని జియో వండర్‌ల్యాండ్‌ను సందర్శించాడు. తన కూతురు సమైరాతో కలిసి ఆడుకుంటున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆల్‌రౌండర్ జడేజా తన భార్య రివా సోలంకితో లండన్‌లో విహరిస్తున్న ఫొటోని పోస్ట్ చేశాడు.
జనవరి 5 నుంచి స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు ఆడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అనంతరం 7, 10 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఇక జనవరి 14, 17, 19 తేదీల్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేల్లో భారత్ తలపడుతుంది.
View this post on InstagramDefinitely beyond my expectations. Thrilling experience at @jiowonderland @ritssajdeh
A post shared by Rohit Sharma (@rohitsharma45) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications