విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే: కుమార సంగక్కర

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అన్నారు. ముంబైలో 'మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్స్' అనే పుడ్ జాయింట్ కార్యక్రమానికి హాజరైన కుమార సంగక్కర, మహిళా జయవర్ధనే విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు.

సంగక్కర మాట్లాడుతూ
ఈ సందర్భంగా సంగక్కర మాట్లాడుతూ "కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడున్న క్రికెటర్లందరిలోకెల్లా అతడు అత్యంత ఎత్తులో ఉన్నాడు. భవిష్యత్‌లో కూడా అలాగే కొనసాగుతాడని ఆశిస్తున్నా. కొన్ని సంవత్సరాలకు ముందు ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌తో పాటు విరాట్ కోహ్లీ అదే స్థాయిలో ఆడేవాడు" అని అన్నాడు.

స్మిత్ ఆటకు దూరం కాగా
"అయితే, ఇప్పుడు స్మిత్ ఆటకు దూరం కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఏబీ డివిలియర్స్ రిటైరయ్యారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. పరుగులు రాబట్టడంలో కోహ్లీ రాటుదేలిపోయాడు. అతడి బ్యాటింగ్‌లో నిలకడ కనిపిస్తుంది. మైదానంలో అతడి వ్యవహారశైలీ కూడా మెరుగుపడింది" అని సంగక్కర చెప్పుకొచ్చాడు.

జయవర్ధనే మాట్లాడుతూ
ఆ తర్వాత మహిళా జయవర్ధనే మాట్లాడుతూ "ఒకప్పుడు టీమిండియా అంటే సచిన్ టెండూల్కర్ గుర్తొచ్చేవారు, ఇప్పుడు కోహ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. సచిన్‌లాగే విరాట్ కోహ్లీ కూడా ఒత్తిడిని జయించడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు. అతడినికి తోడు జట్టులో మంచి ఆటగాళ్లు దొరికారు. అటు బ్యాట్సమెన్‌గా ఇటు కెప్టెన్‌గాను విజయవంతంగా రాణిస్తున్నాడు" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications