Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెస్ట్ బ్యాటింగ్ యావరేజి: రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మరో రికార్డు

 Virat Kohli Has The Best Batting Average For ODI Captain

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (78; 76 బంతుల్లో 6 ఫోర్లు) పరుగులు చేయడంతో అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజి(మినియం 1000 పరుగులు) నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 85 మ్యాచ్‌ల్లో 77.64 యావరేజితో 4969 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ 103 మ్యాచ్‌ల్లో 63.95 యావరేజితో 4796 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ 39 మ్యాచ్‌ల్లో 57.62 యావరేజితో 1671 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

నాలుగో స్థానంలో ధోని

నాలుగో స్థానంలో ధోని

ఆ తర్వాత ధోని 200 మ్యాచ్‌ల్లో 53.56 యావరేజితో 6641 పరుగులు చేసి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... ఆరోన్ పించ్ 30 మ్యాచ్‌ల్లో 50.67 యావరేజితో 1368 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. కాగా, రెండో వన్డేలో ఆసీస్ స్పిన్న‌ర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.

నిరాశగా పెవిలియన్‌కు చేరిన కోహ్లీ

నిరాశగా పెవిలియన్‌కు చేరిన కోహ్లీ

బౌండ‌రీ లైన్ వ‌ద్ద అగ‌ర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. సిక్స్ వెళ్తుంద‌ని అభిమానులంతా భావించినప్పటికీ బౌండ‌రీ రోప్‌కు కొంచెం దూరంలో క్యాచ్ అందుకున్న ఆగర్... రోప్‌ను దాటే క్ర‌మంలో బంతిని మిచెల్ స్టార్క్‌ వైపు విసిరేశాడు. దీంతో స్టార్క్ ఆ బంతిని క్యాచ్‌గా అందుకోవడంతో విరాట్ కోహ్లీ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

ఈ సిరిస్‌లో రెండోసారి

ఈ సిరిస్‌లో రెండోసారి

ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ వికెట్‌ను ఆడమ్ జంపా తీయ‌డం రెండ‌వ సారి. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో సైతం విరాట్ కోహ్లీ జంపా బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా ఆడమ్ జంపా బౌలింగ్‌లో వన్డేలు, టీ20ల్లో కలుపుకుని విరాట్ కోహ్లీ ఔట్ కావడం ఇది ఏడో సారి. వన్డేల విషయానికి మాత్రమే వస్తే ఆడమ్ జంపా 5 సార్లు విరాట్ కోహ్లీని పెవిలియన్‌కు చేర్చాడు.

జంపా బౌలింగ్‌ గణాంకాల్లో ఇదే అత్యధికం

జంపా బౌలింగ్‌ గణాంకాల్లో ఇదే అత్యధికం

ఒక బ్యాట్స్‌మన్‌ను ఎక్కువసార్లు ఔట్‌ చేసిన జంపా బౌలింగ్‌ గణాంకాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. వన్డేల్లో విరాట్ కోహ్లీని అత్యధికంగా వెస్టిండిస్‌కు చెందిన రవి రాంపాల్ 6 సార్లు ఔట్ చేశాడు. ఇది ఏ బౌలర్‌కైనా ఇదే అత్యధికం. శ్రీలంకకు చెందిన తిసారా పెరెరా, న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌతీ వన్డేల్లో విరాట్ కోహ్లీని 5 సార్లు ఔట్ చేసిన మరో ఇద్దరు బౌలర్లు.

ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్

ఇదిలా ఉంటే, రెండో వన్డేలో ఆస్ట్రేలియాకు టీమిండియా 341 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లీ(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

Story first published: Friday, January 17, 2020, 18:40 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+