న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ అద్భుతాలు చేయగలడు.. నిజమైన నాయకుడంటే అతనే'

Virat Kohli Can Be Greater Than Sachin Tendulkar: kirmani
Virat Kohli has potential to be greater than Sachin Tendulkar

సౌతాంప్టన్: సుదీర్ఘ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌పై కోహ్లీ విజృంభించి ఆడుతున్నాడు. టెస్టు సిరీస్‌లో దాదాపు మార్పులతోనే బరిలోకి దిగే కోహ్లీ.. ఈ సారి ఏ మాత్రం మార్పులకు తావివ్వకుండానే టీమిండియాను బరిలోకి దించాడు. అయితే గురువారం మొదలైన నాలుగో టెస్టులో కోహ్లీ 6 వేల పరుగులకు కేవలం 4 పరుగులు దూరంలో
మాత్రమే ఉన్న కోహ్లీ ఆ మైలురాయిని కూడా దాటేసి సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు.

ఇలా టెస్టు ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తోన్న పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ ఛీఫ్‌ సెలెక్టర్‌ సయ్యద్‌ కిర్మణీ ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ లాంటి దూకుడు ఉన్న క్రికెటర్‌ను ఎక్కడా చూడలేదనన్నారు. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తర్వాత అంతటి దూకుడును కోహ్లీలోనే చూశానంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

1
42377

'భారత క్రికెటర్లందరి బ్యాటింగ్ విధానం చూశాను. ఎవరికి వాళ్లు భిన్నంగా ఉన్నారు. కానీ జట్టు సారథి విరాట్‌ కోహ్లీలో మాత్రం ఆకర్షణీయమైన బ్యాటింగ్‌ లక్షణం ఉంది. మ్యాచ్‌ను గెలిపించాలనే తన తపన అనిర్వచనీయం. కోహ్లీని చూస్తే అసూయగా ఉంటుంది. అంత దూకుడుగా ఉండటం తనకే సాధ్యం. మూడు ఫార్మాట్లలోనూ తన ఔట్‌స్టాండింగ్‌ ప్రదర్శనను కనబర్చుతాడు. అన్ని రికార్డులనూ బద్దలు కొట్టగల సామర్థ్యం ఒక్క కోహ్లీకి మాత్రమే సాధ్యం.'

'కోహ్లీ ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించడనుకుంటా. అసలు సిసలైన నాయకుడంటే అతనే. ముందుండి అందర్నీ నడిపిస్తాడు. కష్ట సమయాల్లో జట్టును ఆదుకునే వాడే నిజమైన నాయకుడు ఆ లక్షణాలన్నీ కోహ్లీలో ఉన్నాయి. ఒకటి, రెండు వైఫల్యాల వల్ల వచ్చినా నష్టమేమీ లేదు. కోహ్లీ దూకుడే తనను గెలిపిస్తుంది. సౌరవ్‌ గంగూలీ తర్వాత అంతటి దూకుడును కోహ్లీలోనే చూశాను' అని వివరించారు. 1976 నుంచి 86 వరకు భారత క్రికెట్‌ జట్టులో కీలక పాత్ర పోషించిన కిర్మణీ తన కెరీర్‌లో 88 టెస్టులు,49 వన్డేలు ఆడారు. అక్టోబర్‌ 2003 నుంచి సెప్టెంబర్‌ 2004 వరకు చీఫ్‌ సెలెక్టర్‌గా కిర్మానీ వ్యవహరించారు.

Story first published: Friday, August 31, 2018, 18:21 [IST]
Other articles published on Aug 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X