ఫోర్బ్స్ జాబితా: సాకర్ దిగ్గజం మెస్సీని దాటేసిన కోహ్లీ
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అంతేకాదు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మూడు ఫార్మెట్లలో దూసుకుపోతోంది. దీంతో విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన అథ్లెట్ల టాప్-10 జాబితాను ఫోర్బ్స్ బుధవారం ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ 14.5మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈ జాబితాలో 9వ స్థానం దక్కించుకోవడం.

మెస్సీని వెనక్కు నెట్టిన కోహ్లీ
ఈ జాబితాలో మరికొందరు దిగ్గజ సాకర్ ఆటగాళ్లను సైతం విరాట్ కోహ్లీ వెనక్కినెట్టాడు. కేవలం బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఆటకు సంబంధించిన జీతాలు, బోనస్, పెట్టబడుల ద్వారా వచ్చే డబ్బును ఇందులో కలపలేదు.

అగ్రస్ధానంలో రోజర్ ఫెదరర్
ఈ జాబితాలో స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అగ్రస్ధానంలో నిలిచాడు. మరోవైపు క్రికెటర్లలో టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం. స్టార్ పుట్‌బాల్ ప్లేయర్లు లియోనల్ మెస్సీ, గోల్ఫ్ సూపర్ స్టార్ రోరీ కంటే కూడా కోహ్లీకే బ్రాండ్ విలువ ఎక్కువుంది.

సచిన్ తర్వాత కోహ్లీనే
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుస సిరిస్ విజయాలతో దూసుకుపోతుంది. టెస్టుల్లో ఎప్పటినుంచో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియా, తాజాగా వన్డేల్లో కూడా అగ్రస్ధానాన్ని దక్కించుకుంది. గత ఆదివారం ముంబై వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన కెరీర్‌లో 31వ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో సచిన్ (49) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 అథ్లెట్ల జాబితా:
1. రోజర్ ఫెదరర్ (37.2 మిలియన్ డాలర్లు)
2. లిబ్రాన్ జేమ్స్ (33.4)
3. ఉసేన్ బోల్ట్ (27)
4. క్రిస్టీనొ రొనాల్డో (21.5)
5. ఫిల్ మెక్లిసన్ (19.6)
6. టైగర్ వుడ్స్ (16.6)
7. విరాట్ కోహ్లీ (14.5)
8. రోరీ మెక్లోరి (13.6)
9. మెస్సి (13.5)
10. స్టీఫ్ కర్రీ (13.4)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications