Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంకెన్నాళ్లు! రెండేళ్లుగా సెంచరీ చేయ‌ని కోహ్లీ.. కెరీర్‌లోనే అత్యంత త‌క్కువ ర‌న్స్‌

Virat Kohli has not scored century in two years

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడంటే బౌల‌ర్ల‌కు ద‌డే. ఎలాంటి బంతులైన సునాయ‌సంగా బాదేస్తూ ప‌రుగులు సాధిస్తాడు. ప్ర‌పంచ టాప్ బౌల‌ర్ల‌ను సైతం తేలిక‌గా ఎదుర్కొంటాడు. బౌల‌ర్ల‌కు అంతు చిక్క‌ని అస్త్రాల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తాడు. చూస్తుండ‌గానే సెంచ‌రీ పూర్తి చేసుకుంటాడు. బ‌రిలోకి దిగాడంటే సెంచ‌రీ ఖాయ‌మ‌న్న‌ట్టుగా కోహ్లీ ఇన్నింగ్స్ సాగుతుంది. ఈ క్ర‌మంలో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. అంతే కాకుండా ర‌న్‌మెషీన్‌గాపేరు తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా గ‌తం. ప్ర‌స్తుతం కోహ్లీ నుంచి అలాంటి ఆట క‌న‌ప‌డ‌డం లేదు.

రెండేళ్లుగా ఒక్క సెంచ‌రీ కూడా లేదు

రెండేళ్లుగా ఒక్క సెంచ‌రీ కూడా లేదు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేయ‌క‌ ఏకంగా రెండేళ్లు గ‌డిచిపోయింది. కోహ్లీ కెరీర్‌లో తొలిసారి రెండు సంవ‌త్స‌రాలు సెంచ‌రీ లేకుండా గ‌డిచిపోయింది. 2020, 2021లో ఒక్క సెంచ‌రీ కూడా చేయ‌లేక‌పోయాడు ఈ ర‌న్ మెషీన్‌. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి 2008లో అడుగుపెట్టిన కోహ్లీ తొలి ఏడాది 5 మ్యాచ్‌లో ఆడ‌డంతో ఒక్క సెంచ‌రీ కూడా చేయ‌లేదు. ఇక 2009లో కెరీర్‌లోనే తొలి సెంచ‌రీ చేసి త‌న శ‌త‌కాల ఖాతాను తెరిచాడు కోహ్లీ. ఆ ఏడాది మొత్తంలో కోహ్లీ సాధించిన సెంచ‌రీ కూడా అదొక్క‌టే. ఆ త‌ర్వాతి ఏడాది నుంచి క్ర‌మక్ర‌మంగా త‌న సెంచ‌రీల సంఖ్యను పెంచుకుంటూ వ‌చ్చిన కోహ్లీ ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.

11 ఏళ్లపాటు సెంచ‌రీల మోత‌

11 ఏళ్లపాటు సెంచ‌రీల మోత‌

కోహ్లీ అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 2010లో 3, 2011లో 4, 2012లో 8, 2013లో 6, 2014లో 8, 2015లో 4, 2016లో 7 సెంచ‌రీలు బాదాడు. ఇక త‌న కెరీర్‌లోనే 2017, 2018లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదాడు. ఈ రెండు సంవ‌త్స‌రాల్లోనే అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి కోహ్లీ 11 సెంచ‌రీల చొప్పున, 22 సెంచ‌రీలు కొట్టేశాడు. 2019లోనూ 7 సెంచ‌రీల‌తో స‌త్తా చాటాడు. ఇలా వ‌రుస‌గా 11 ఏళ్లు విరాట్ కోహ్లీ సెంచ‌రీల మోత మోగించాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 70 సెంచ‌రీలు కొట్టేశాడు.

రెండేళ్లుగా ఊరిస్తున్న రికార్డు

రెండేళ్లుగా ఊరిస్తున్న రికార్డు

మ‌రొక సెంచరీ చేస్తే అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స‌ర‌స‌న విరాట్ కోహ్లీ చేరుతాడు. అదే రెండు సెంచ‌రీలు బాదితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు. కానీ 2020, 2021 సంవ‌త్సరాల్లో ఒక్క సెంచ‌రీ కూడా న‌మోదు చేయ‌లేక‌పోయాడు. కోహ్లీ కెరీర్‌లో ఇలా వ‌రుస‌గా రెండు సంవ‌త్స‌రాలు సెంచరీ చేయ‌ల‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. దీంతో రెండేళ్లుగా కోహ్లీ అత్య‌ధిక సెంచ‌రీల జాబితాలో రెండో స్థానంలో నిలిచే రికార్డు ఊరిస్తూనే ఉంది.

కెరీర్‌లోనే తొలిసారి

కెరీర్‌లోనే తొలిసారి

2020లో అన్ని ఫార్మాట్ల‌లో కలిపి మొత్తం 22 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 24 ఇన్నింగ్స్‌ల్లో 36 స‌గ‌టుతో 842 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 7 సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. అత్య‌ధిక ప‌రుగులు 89. కోహ్లీ కెరీర్ ప్రారంభ‌మైన 2008 సంవ‌త్స‌రాన్ని ప‌క్క‌న పెడితే, కోహ్లీ కెరీర్‌లో అత్య‌ల్ప స‌గ‌టు న‌మోదైన సంవ‌త్స‌రంగా 2020 నిలిచింది. 2021లో 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 30 ఇన్నింగ్స్‌ల్లో 37 స‌గ‌టుతో 964 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 10 సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అత్య‌ధిక ప‌రుగులు 80*. అంతేకాకుండా కోహ్లీ కెరీర్‌లో 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌రుస‌గా రెండు సంవ‌త్సరాలు 1000 ప‌రుగుల లోపే చేయ‌డం ఇదే తొలిసారి. కోహ్లీ కెరీర్‌లోనే తక్కువ ప‌రుగులు చేసిన సంవ‌త్స‌రాలుగా 2020, 2021 నిలిచిపోయాయి. దీంతో కోహ్లీ త‌న కెరీర్‌లోనే ప్ర‌స్తుతం అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నాడ‌ని చెప్పుకోవాలి.

Story first published: Thursday, December 30, 2021, 10:06 [IST]
Other articles published on Dec 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+