Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులో దక్కని చోటు: కోహ్లీకి మద్దతుగా యువీ తల్లి

హైదరాబాద్: భారత జట్టులో యువీకి చోటు దక్కకపోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర ఎంతమాత్రం లేదని యువీ తల్లి షబ్నం సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ కోసం తొలి మూడు వన్డేలకు ప్రకటించిన జట్టులో సెలక్టర్లు యువీకి మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తొలి మూడు వన్డేలకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంపై యువీ చాలా బాధపడినట్లు యువీ తల్లి షబ్నం సింగ్‌ తెలిపారు. ఆజ్ తక్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ 'యువీకి ఎప్పుడూ కోహ్లీ మద్దతు ఉంటుంది. కోహ్లీ ఎంత ఫిట్‌గా ఉంటాడో జట్టులో ఆటగాళ్లు కూడా అంతే ఫిట్‌గా ఉండాలని భావిస్తాడు' అని వెల్లడించింది.

ఫిట్‌నెస్‌పై నియమ నిబంధనలు ఏ ఆటగాడికైనా ఒకటే

ఫిట్‌నెస్‌పై నియమ నిబంధనలు ఏ ఆటగాడికైనా ఒకటే

'ఫిట్‌నెస్‌పై నియమ నిబంధనలు ఏ ఆటగాడికైనా ఒకటే. వీటిలో యువీకి ఎలాంటి మినహాయింపు ఉండదు. భవిష్యత్తులో అతను కచ్చితంగా జట్టులో స్థానం దక్కించుకుంటాడు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇందు కోసం తగిన కసరత్తులు చేస్తున్నాడు' అని యువీ తల్లి షబ్నం తెలిపింది.

ప్రూవ్ చేసుకునేందుకు యువీకి ఏమీ మిగల్లేదు

ప్రూవ్ చేసుకునేందుకు యువీకి ఏమీ మిగల్లేదు

'ప్రతిదీ ఛాలెంజ్‌గా తీసుకుంటాడని... గత కొన్ని సంవత్సరాలుగా యువీని చూస్తే మీకు ఇదే అర్ధం అవుతుంది. ప్రూవ్ చేసుకునేందుకు యువీకి ఏమీ మిగల్లేదు. వరల్డ్ కప్ గెలిచాడు.. అంతేకాదు గతేడాది ఐపీఎల్ కూడా గెలిచాడు. అయితే క్రికెట్ పట్ల అతడికి ఉన్న ప్రేమే దేశానికి ఆడేలా చేస్తుంది' అని వెల్లడించింది.

సెప్టెంబరు 19 ప్రత్యేకతపై యువీ ఇలా

సెప్టెంబరు 19 ప్రత్యేకతపై యువీ ఇలా

ఇదిలా ఉంటే యువరాజ్ సింగ్‌కు తన కెరీర్‌లో సెప్టెంబరు 19 ఎంత ప్రత్యేకమైంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున 2007లో దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

అదృష్టవశాత్తూ జరిగింది అంతే

అదృష్టవశాత్తూ జరిగింది అంతే

దీనిపై బుధవారం యువీ మీడియాతో మాట్లాడాడు. 'నేను గాల్లోకి బంతిని లేపడం మా నాన్నకు ఇష్టం ఉండదు. బంతి గ్రౌండ్‌ను తాకేలా బ్యాటింగ్‌ చేయాలని సూచించేవారు. వరుస సిక్స్‌లు బాదేందుకు ఎటువంటి ప్రత్యేక వ్యూహాలు రచించలేదు. బంతులు నాకు అందడం.. వాటిని సిక్స్‌లుగా మల్చడం అంతా అదృష్టవశాత్తూ జరిగింది' అని యువీ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+