For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ అలాంటి వాడు కాదు, అందరూ ఒప్పుకున్న తర్వాతే..

Virat Kohli Has Never Wielded Disproportionate Influence, Says CoA Chief Vinod Rai

హైదరాబాద్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విధానపర నిర్ణయాల్లో తమపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని సీవోఏ (పాలకుల కమిటీ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపాడు. అటువంటి పరిస్థితులేమీ లేవని కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీవోఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ చెప్పారు. విధానపరమైన నిర్ణయాల్లో కోహ్లీ ప్రభావమేమీ లేదన్నారు. ఢిల్లీలోని జిమ్‌ఖానాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాయ్, విరాట్‌పై ప్రశంసలు కురిపిస్తూ పలు అంశాలపై మాట్లాడాడు.

టీమ్ మేనేజ్‌మెంట్‌పై గానీ, సెలక్టర్లపై గానీ అతను ఏ విషయంలోనూ ఒత్తిడి చేయలేదు. కోహ్లీ ఒత్తిడి తీసుకురావడం వల్లే ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేశారంటూ అప్పట్లో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే అని రాయ్ తెలిపాడు.

జట్టు బాధ్యతలు మోయాల్సింది కెప్టెనే:

జట్టు బాధ్యతలు మోయాల్సింది కెప్టెనే:

‘ప్రతి కెప్టెన్‌కు జట్టుపై కొంత అధికారం ఉంటుంది. జట్టు బాధ్యతలు మోయాల్సింది అతనే. దీంతో పరిమితులకు లోబడి అతడికి విచక్షణ, స్వేచ్ఛ ఇవ్వడాన్ని సమర్థిస్తాన'ని రాయ్‌ పేర్కొన్నారు. విరాట్‌ అతిగా ప్రవర్తిస్తున్నాడంటూ ఇంతవరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పాలసీ విషయాల్లో కోహ్లీ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని తెలిపారు.

కోహ్లీని కౌంటీలు ఆడేందుకు అనుమతించడం వెనుక కారణాన్ని

కోహ్లీని కౌంటీలు ఆడేందుకు అనుమతించడం వెనుక కారణాన్ని

మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు కూడా ఎప్పూడూ కోహ్లీపై ఫిర్యాదు చేయలేదన్నారు. సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఎటువంటి ఒత్తిడులకూ లొంగే రకం కాదన్నారు. కోహ్లీని కౌంటీలు ఆడేందుకు అనుమతించడం వెనుక కారణాన్ని వివరించారు. సౌతాఫ్రికా టూర్‌లో ఎదురైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంగ్లండ్‌ వాతావరణానికి అలవాటుపడాలనే ఈ విధంగా చేశామన్నారు.

ఎమ్మెస్కే కాస్త ఒత్తిడిలో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి..:

ఎమ్మెస్కే కాస్త ఒత్తిడిలో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి..:

ఒకసారి జట్టు ఎంపిక విషయంలో ఎమ్మెస్కే కాస్త ఒత్తిడిలో కనిపించాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ప్రతిభ ఆధారంగానే జట్టును ఎంపిక చేయాలని నేను అతనికి సూచించాను. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు జట్టు ఎంపిక చేసినపుడూ నేను, డయానా ప్యానెల్‌లో కూర్చోనేలేదు. ఎమ్మెస్కేపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ మేము టీమ్ మేనేజ్‌మెంట్, ఇండియాఏ కోచ్ ద్రవిడ్‌తో చర్చించాకే ఆ నిర్ణయం తీసుకున్నాం.

పింక్ బాల్‌తో ఆడేందుకు ఆటగాళ్లు

పింక్ బాల్‌తో ఆడేందుకు ఆటగాళ్లు

జట్టు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించిందని, పింక్ బాల్‌తో ఆడేందుకు ఆటగాళ్లు ఇంకా సిద్ధంగా లేరని కోచ్ రవిశాస్త్రి మాకు తెలిపాడు.అందుకే పింక్ బాల్‌తో ఇప్పుడప్పుడే కుదురదని ఆసీస్‌కు తేల్చి చేప్పేశాం అని రాయ్ మీడియాకు తెలిపాడు.

Story first published: Tuesday, May 22, 2018, 11:43 [IST]
Other articles published on May 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+