Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'విరాట్ కోహ్లీ టీమిండియాకు గర్వం, దూకుడుని నేర్పాడు'

Virat Kohli has given Indian team pride, aggression: Mike Brearley

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియాకు దూకుడు నేర్పాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ బ్రెయర్లీ అన్నాడు. కోహ్లీ జట్టులో అత్మవిశ్వాసాన్ని నింపాడని ప్రశంసల వర్షం కురిపించాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇండియా vs దక్షిణాఫ్రికా తొలి వన్డే స్కోరు కార్డు

ఇప్పటి వరకు డర్బన్‌లో ఆడిన ఏడు వన్డేల్లో ఒక్కటీ నెగ్గని టీమిండియా ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. కింగ్స్‌మీడ్‌లో 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విరాట్‌ కోహ్లీ (112), రహానె (79) పరుగులతో రాణించడంతో 45.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది.

ఈ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్యఛేదన కావడం విశేషం. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ బ్రెయర్లీ మాట్లాడుతూ 'నేను కోహ్లీకి దరిదాపుల్లో లేను. అతడి ఆటను ఆరాధిస్తున్నా. అతను జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు దూకుడును నేర్పాడు. అతనెప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు' అని అన్నాడు.

'కోహ్లీ తెలివైన బ్యాట్స్‌మన్‌. ప్రపంచంలో ఎక్కడైనా అతడు పరుగులు చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా అతనిలో ఉంది. కోహ్లీ టీమిండియాకు దూకుడు నేర్పిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని మైక్‌ బ్రెయర్లీ చెప్పుకొచ్చాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ 1-2తో చేజార్చుకున్నప్పటికీ పరిమిత ఓవర్ల సిరిస్‌ను మాత్రం కోహ్లీసేన విజయంతో మొదలుపెట్టింది. ఆరు వన్డేల సిరిస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 2, 2018, 16:39 [IST]
Other articles published on Feb 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+