Virat Kohli: అరుదైన ఘనత సాధించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్..

విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‍ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనేను అధికమించిన కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ 25 మ్యాచ్ ల్లో 23 ఇన్నింగ్స్ ల్లో 1047 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. బంగ్లా దేశ్‌తో మ్యాచ్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మహేళ జయవర్దనే 31 ఇన్నింగ్స్ ల్లో 1016 పరుగులు చేశాడు.

ఆఫ్ సెంచరీ
క్రిస్ గేల్ 31 ఇన్నింగ్స్ ల్లో 965 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ 34 ఇన్నింగ్స్ ల్లో 921 పరుగులు చేశాడు. ఇందులో జయవర్దనే, గేల్ రిటైర్ అయ్యారు. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ గత నాలుగు మ్యాచ్ ల్లో మూడింటిలో హాఫ్ సెంచరీ చేశాడు. పాకిస్థాన్ పై అతడు ఆడిన ఇన్నింగ్స్ ఈ సంవత్సరానికే హైలేట్ గా నిలించింది.

కేఎల్ రాహుల్
అక్టోబర్ 23 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 4 సిక్స్ లు ఆరు ఫోర్లతో నాటౌట్ గా నిలిచాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 12 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ
కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. 8 బంతుల్లో 2 పరుగులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్ లో యాసిర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అప్పటికే రోహిత్ శర్మ క్యాచ్ ను బంగ్లా ఫీల్డర్లు మిస్ చేశారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ మళ్లీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.రోహిత్ గత మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు.నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. సూర్య కుమార యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications