Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కింగ్ కోహ్లీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా: తొలి ప్లేయర్ అతనే

Virat Kohli has completed 300 millions followers on Instagram, Twitter and facebook

ముంబై: విరాట్ కోహ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ క్లాస్ క్రికెటర్. క్లాసిక్ ప్లేయర్. ఈ జనరేషన్‌కు ఆరాధ్యుడు. అన్ని ఫార్మట్‌ల క్రికెట్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని అందుకున్నాడు కింగ్ కోహ్లీ. అందుకే అతనికి ఫాలోయింగ్ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే.. భారత్‌లో అతనికి ఉన్న సోషల్ మీడియా ఫాలవోర్ల సంఖ్య మరెవరికీ లేదు. గ్రౌండ్‌లో విజృంభించినట్టే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అతనికి ఎదురు లేదు.

విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య 300 మిలియన్లను దాటింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో అతన్ని అనుసరించే అభిమానులు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నారు. ట్విట్టర్‌లో కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 48.5 మిలియన్లు. ఫేస్‌బుక్‌లో ఈ సంఖ్య కాస్త ఎక్కువే. 49.3 మిలియన్ల మంది విరాట్ కోహ్లీ అధికారిక అకౌంట్‌ను అనుసరిస్తోన్నారు. ఈ రెండింటికీ మించి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 200 మిలియన్ల మార్క్‌ను దాటింది. 202గా రిజిస్టర్ అయింది. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అతన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 300 మిలియన్లకు చేరుకోవడం ఓ రికార్డు. సోషల్ మీడియాలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పొందిన వారిలో విరాట్ కోహ్లీ రెండో వ్యక్తి. ఆసియాలో రీజియన్‌లో ఈ ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న తొలి క్రీడాకారుడు విరాటే.

ఇంత పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్ మరొకరు లేరు. క్రీడాకారుడిగా మూడో వ్యక్తి విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అతను లండన్‌లో ఉంటోన్నాడు. భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఓ టెస్ట్ మ్యాచ్, మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉంది. దీనికోసం సన్నద్ధమౌతున్నాడు. జులై 1వ తేదీన టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి.

Story first published: Sunday, June 19, 2022, 14:24 [IST]
Other articles published on Jun 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+