For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: కోహ్లీ జట్టు ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాల్లేవ్

Virat Kohli has been an integral part of the Royal Challengers Bangalore scheme of things and this year is no different.

హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి స్థిరంగా ఒకే జట్టులో కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న కోహ్లీ ఒక్క సారి కూడా జట్టును ఐపీఎల్‌లో గెలిపించలేకపోయాడు. పదకొండో సీజన్ రాబోతున్న తరుణంలో భారత కెప్టెన్ పరువు నిలపడం కోసం ఆ జట్టు యాజమాన్యం కోహ్లీని 17 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.

లీగ్‌లో ఆడుతున్న అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఇలా కోహ్లీకి ఐపీఎల్‌ను గెలిచేందుకై ఆ జట్టు యాజమాన్యం మరో అవకాశం కల్పించింది. అంతేకాకుండా అతనికి సన్నిహితుడైనటువంటి డివిలియర్స్‌ను సైతం రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంది. ఈ సారైనా లీగ్ టైటిల్ గెలుచుకోవాలనే ఆశతో జట్టు యాజమాన్యం భారీ సన్నాహాలు చేస్తోంది.

149 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ లీగ్ ఐపీఎల్‌లోనే కొత్త రికార్డు సృష్టించాడు. 4418పరుగులు తీసిన కోహ్లీ యావరేజ్ 37.44గా ఉంది. ఇంకా నాలుగు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు 129.28 స్ట్రైక్ రేట్‌తో అతని ఖాతాలో ఉన్నాయి.

కాగా, ఈ మధ్యనే ఐసీసీ విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ జట్టు ఎంపికకై ఏయే ఆటగాళ్లను తీసుకోనుందో జనవరి 27, 28 తేదీల్లో తేలనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 18:20 [IST]
Other articles published on Jan 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+