Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గత రాత్రి 'హాట్ బ్యూటీ'తో సినిమా చూశా.. కోహ్లీ సెన్సేషనల్ కామెంట్!!

Virat Kohli has an intimate movie date with his hottie Anushka Sharma

ముంబై: బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అనంతరం లభించిన విశ్రాంతిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. బంగ్లా సిరీస్‌ను ముగించుకుని కోల్‌కతా నుండి ముంబై చేరుకున్న కోహ్లీ ప్రస్తుతం సరదాగా గడుపుతున్నాడు. డిసెంబర్ 6న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌కు ఓ వారం సమయం ఉండడంతో.. కోహ్లీ ఈ విరామాన్ని పూర్తిగా కుటుంబంకు వెచ్చిస్తున్నాడు.

'గత రాత్రి ఈ హాటీతో సినిమా:

దొరికిన ఖాళీ సమయంలో కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు. బుధవారం రాత్రి కోహ్లీ, అనుష్క కలిసి సినిమా చూసారు. దీనికి సంబందించిన ఫొటోలు కోహ్లీ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పోస్ట్ చేసాడు. 'గత రాత్రి ఈ హాటీతో సినిమా' అని కాఫ్టన్ రాసాడు. ఈ ఫోటోలలో కోహ్లీ, అనుష్క క్యాజువల్ దుస్తుల్లో కనువిందు చేశారు. అనుష్క పసుపు రంగు టాప్ ధరించి కనిపించగా.. విరాట్ డెనిమ్ జాకెట్ ధరించాడు.

సోషల్ మీడియాలో వైరల్:

సోషల్ మీడియాలో వైరల్:

ప్రస్తుతం విరుష్క ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అభిమానులు వేలకొద్ది లైకులు, కామెంట్లు పెట్టారు. 'బెస్ట్ కపుల్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'హాటీ అనుష్క' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. నవంబర్‌ 5వ తేదీన కోహ్లీ 31వ ఏట ప్రవేశించాడు. ఆ రోజున అనుష్కతో కలిసి కోహ్లీ భూటాన్‌లో పుట్టినరోజును వేడుకలను జరుపుకున్నాడు.

 అనుష్కతో జీవితాన్నిఆస్వాధిస్తున్నా:

అనుష్కతో జీవితాన్నిఆస్వాధిస్తున్నా:

ఒక రోజు క్రితం అనుష్కతో కలిసి కోహ్లీ ట్రెక్కింగ్‌కి కూడా వెళ్ళాడు. విరుష్క జోడి అందమైన కొండపైన ట్రెక్కింగ్ చేశారు. దీనికి సంబందించిన ఫొటోను కూడా కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'అనుష్కతో కలిసి జీవిత ప్రయాణాన్ని ఆస్వాధిస్తున్నా. అంతిమంగా మా ఇద్దరి మద్య మిగిలేది ప్రేమే' అని రాసుకొచ్చాడు.

వరుసగా ఏడో టెస్టు విజయం:

వరుసగా ఏడో టెస్టు విజయం:

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే సమయంలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా టీమిండియా నెలకొల్పింది.

కోహ్లీ @ 20000:

కోహ్లీ @ 20000:

గత పదేండ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితా టాప్‌లో నిలిచిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు (69), అర్ధ సెంచరీ (95)ల రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ 50కి పైగా సగటుతో పరుగులు చేసిన రన్‌మెషీన్‌.. టెస్టుల్లో 8818, వన్డేల్లో 11,036, టీ20ల్లో 2450 (మొత్తం 20,688) రన్స్‌ చేశాడు.

Story first published: Thursday, November 28, 2019, 14:34 [IST]
Other articles published on Nov 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+