కోహ్లీ షేక్‌హ్యాండ్ వివాదం.. ట్రావిస్ హెడ్ దిమ్మతిరిగే కౌంటర్!
ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదురుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రావిస్ హెడె షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచినా విరాట్ కోహ్లీ పట్టించుకోకుండా వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అవమానంపై ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పరోక్షంగా విరాట్ కోహ్లీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ట్రావిస్ హెడ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని షేర్ చేశాడు. ఆ ఫోటోలో తను ఆర్సీబీ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న చిత్రం ఉంది. సాధారణంగా హెడ్ పార్ట్-టైమ్ బౌలింగ్ మాత్రమే చేస్తుంటాడు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బౌలింగ్ చేయడమే కాకుండా ఆర్సీబీ కెప్డెన్ రజత్ పాటిదార్ కీలక వికెట్‌ను కూడా పడగొట్టాడు. ఈ ఫోటో కింద ట్రావిస్ హెడ్.."కీప్ ద బాడీ గెస్సింగ్" (Keep the body guessing) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు.

సాధారణంగా జిమ్‌లో వర్కవుట్ చేసేటప్పుడు శరీరం ఒకే రొటీన్ కు అలవాటు పడకుండా కొత్త కొత్త పద్ధతులు ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడుతుంటారు. అయితే క్రికెట్ పరంగా హెడ్ ఉద్దేశం ఏమిటంటే.. తను కేవలం ఓపెనింగ్ బ్యాటర్ మాత్రమే కాదు.. అవసరమైతే బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీయగలనని, తన తదుపరి వ్యూహం ఎవరూ ఊహించలేరని విరాట్ కోహ్లీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ విసినట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ద్వారా ట్రావిస్ హెడ్ తనను తాను తక్కువ అంచనా వేయవద్దంటూ విరాట్ కోహ్లీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సాధారణంగా జిమ్‌లో వర్కవుట్ చేసేటప్పుడు శరీరం ఒకే రొటీన్‌కు అలవాటు పడకుండా కొత్త కొత్త పద్ధతులు ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడుతుంటారు. అయితే క్రికెట్ పరంగా హెడ్ ఉద్దేశం ఏంటంటే.. తను కేవలం ఓపెనింగ్ బ్యాటర్ మాత్రమే కాదు, అవసరమైతే బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీయగలనని, తన తదుపరి వ్యూహం ఏంటో ఎవరూ ఊహించలేరని విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఇండైరెక్ట్‌గా సెటైర్ వేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ద్వారా హెడ్ తనను తాను తక్కువ అంచనా వేయవద్దంటూ కోహ్లీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు వీరి మధ్య మైదానంలో అంతలా గొడవ జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ సీజన్‌లో హెడ్ చాలా మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా లేదా సబ్‌స్టిట్యూట్‌గా మాత్రమే మైదానంలోకి వచ్చాడు. కానీ ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో అతను అలా కాకుండా డైరెక్ట్‌గా ఆడాడు. ఆ సమయంలో కోహ్లీ మైదానంలో హెడ్‌ను కెలుకుతూ.. "ఈ మ్యాచ్‌లో నువ్వు సబ్‌స్టిట్యూట్ కాదుగా, ధైర్యముంటే వచ్చి బౌలింగ్ చెయ్" అంటూ సవాల్ విసిరాడు. అయితే కోహ్లీ త్వరగానే అవుట్ కావడంతో.. హెడ్ స్పందిస్తూ.. "నేను బౌలింగ్‌కు రాకముందే నువ్వు అవుటై పెవిలియన్ చేరావుగా" అంటూ మైదానంలోనే స్లెడ్జింగ్ చేశాడు. ఈ గొడవ మనసులో పెట్టుకునే మ్యాచ్ అయ్యాక కోహ్లీ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మరి హెడ్ ఇచ్చిన ఈ ఇన్‌స్టా కౌంటర్‌పై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications