For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మునుపటి కోహ్లీ ఆడిన వేళ, మ్యాక్స్‘వెల్’ హిట్టింగ్ చేసిన వేళ, గుజరాత్‌పై ఆర్సీబీ విజయ దుందుభి

Virat Kohli half century, Maxwell Huge hitting makes RCB solid victory over Gujarat

విరాట్ కోహ్లీ మునుపటి కోహ్లీలా చెలరేగిన వేళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో కోహ్లీ (73పరుగులు 54బంతుల్లో 8ఫోర్లు 2సిక్సర్లు) వీరవిహారం చేశాడు. మరో వైపు ఫాఫ్ డుప్లెసిస్ (44పరుగులు 38బంతుల్లో 5ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. ఇక చివర్లో మ్యాక్స్ వెల్ (40పరుగులు 18బంతుల్లో 5ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్) తన మార్క్ హిట్టింగ్ చేశాడు. దీంతో ఆర్సీబీ అలవోకగా గుజరాత్ టైటాన్స్ పై గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ గెలిచి తన ప్లేఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా ఉంచుకున్నప్పటికీ ఆ జట్టు భవితవ్యం మాత్రం ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోతేనే ఆర్సీబీ ప్లేఆఫ్ చేరే వీలుంటుంది. ఢిల్లీ గెలిస్తే మాత్రం ఆర్సీబీ(-0.253)తో పోలిస్తే మంచి నెట్ రన్ రేట్ వల్ల ఆ జట్టు ప్లేఆఫ్ చేరుతుంది.

అంతకుముందు రాణించిన హార్దిక్ పాండ్యా

అంతకుముందు రాణించిన హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబైలోని వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 168పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62పరుగులు 47బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), డేవిడ్ మిల్లర్ (34పరుగులు 25బంతుల్లో 3సిక్సర్లు) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హజిల్ వుడ్ 2, హసరంగ 1, మ్యాక్స్ వెల్ 1వికెట్ తీశారు. గుజరాత్ విధించిన 169పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఛేదించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది.

 సీరియస్‌గా తీసుకున్న కోహ్లీ

సీరియస్‌గా తీసుకున్న కోహ్లీ

ఇక ప్లేఆఫ్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడేమో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. షమీ వేసిన మూడో ఓవర్లో బౌండరీలు మొదలెట్టిన కోహ్లీ తన రిథమ్ కొనసాగించాడు. ఆ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లోనూ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డు మూమెంటమ్ పెంచేశాడు. ఆ తర్వాత అడపాదడపా ఫోర్లు కొడుతూ మంచి స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేశాడు. ఈ క్రమంలో 10వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలిగ్లో సిక్సు కొట్టిన కోహ్లీ 33బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ ధాటికి తోడు డుప్లెసిస్ కూడా బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ధాటికి గుజరాత్ బౌలర్లు తేలిపోయారు. స్కోరు బోర్డు 12ఓవర్లకే వికెట్ కోల్పోకుండా 102పరుగులకు స్కోరు చేరుకుంది. తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 115పరుగులు జోడించారు.

తుఫాన్ ఇన్నింగ్స్‌తో ముగించిన మ్యాక్స్ వెల్

తుఫాన్ ఇన్నింగ్స్‌తో ముగించిన మ్యాక్స్ వెల్

ఇక ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. తన తెలివైన బంతితో డుప్లెసిస్ ను క్యాచ్ అవుట్ చేశాడు. డుప్లెసిస్ అవుట్ అయినప్పటికీ క్రీజులో దిగిన మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగా ఆ ఓవర్లో రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టిన మ్యాక్సీ ఆ ఓవర్లో 18పరుగులు పిండుకున్నాడు. రషీద్ వేసిన 17వ ఓవర్లో సిక్సు కొట్టిన కోహ్లీ.. తర్వాత బంతికి హిట్టింగ్ చేయాలని చూసి స్టంప్ అవుట్ అయ్యాడు. అప్పటికే ఆర్సీబీ విజయానికి చేరువైపోయింది. ఇక 19వ ఓవర్లో మ్యాక్స్ వెల్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Story first published: Thursday, May 19, 2022, 23:32 [IST]
Other articles published on May 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+