For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డేలో ధోనీపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లీ

కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి.

రెండో వన్డేలో భారత్ విజయం: 2-0తో సిరిస్ కైవసం

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. అనంతరం 382 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధాటిగా ఆడారు. ఇయాన్ మోర్గాన్ 102 పరుగులు, జాసన్ రాయ్ 82, రూట్ 54, మొయిన్ అలీ 55 పరుగులతో రాణించినా ఇంగ్లాండ్‌ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

వరుసగా వికెట్లు పడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిలకడగా ఆడుతూ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 46 ఓవర్లకు 319 పరుగులు చేసింది. అయితే ఒకానొక దశలో ఇంగ్లండ్ ఆటగాల్లు తేలికగానే టార్గెట్‌ను ఛేదించేలా కనిపించారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

Virat Kohli Hails Yuvraj Singh, MS Dhoni After Cuttack ODI Win

బంతి అందించిన ప్రతి బౌలర్‌తో మంతనాలు జరిపాడు. ప్రతి బంతికి ఏదో ఒక సూచన ఇస్తూ వారిపై ఒత్తిడి పెంచాడు. దీంతో కొన్ని బంతులు ఇంగ్లండ్ బ్యాట్స్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో ధోని మాత్రం కూల్‌గా ఉంటూ ఫీల్డర్లను మార్చేవాడు.

బౌలర్ ఎలాంటి బంతులు వేయాలనుకుంటున్నాడో తెలుసుకునేవాడు. అందుకు అనుగుణంగా ఫీల్డర్స్‌ను మోహరించేవాడు. అలాంటి ప్రయత్నమేదీ చేయని కోహ్లీ, భావోద్వేగాలను నియంత్రించుకోకుండా, ఎవరైనా బౌలర్ మిస్ ఫీల్డ్ చేస్తే చిరాగ్గా స్పందించాడు. ధోనీ అలా బంతిని వదిలేసినప్పుడు కూడా కోహ్లీ గట్టిగా అరిచాడు.

ఇంగ్లాండ్ ధాటిగా ఆడుతున్న సమయంలో బ్యాట్స్‌మెన్ ఫ్లంకెట్ ఇచ్చిన క్యాచ్‌ను సమయలోపం కారణంగా ధోనీ అందుకోలేక పోవడంతో అది ఫోర్ వెళ్లింది. దీంతో కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+