మేమంతా ఒక జట్టు: గెలుపుపై కోహ్లీ అద్భుతమైన మెసేజ్
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడాడు. రెండో టెస్టు విజయాన్ని ఓ తియ్యటి విజయంగా అభివర్ణించాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 16వ టెస్టు విజయం కావడం విశేషం. రెండో టెస్టు మ్యాచ్ భావోద్వేగాలతో కూడిన మ్యాచ్ అని కోహ్లీ తెలిపాడు.
ఇప్పటివరకు గెలిచిన టెస్టుల్లో ఇదే అత్యుత్తమ టెస్టు అని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ టెస్టులో మేము సమష్టిగా పోరాడి విజయం సాధించామని అన్నాడు. 'ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. మేమంతా ఒక జట్టు. సమిష్టిగా విజయాలు సాధిస్తాం. సమిష్టిగానే ఓడిపోతాం. బాయ్స్ మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. జై హింద్' అని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుత ప్రదర్శన
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా, పేస్ బౌలర్లతో కలిసి అద్భుతంగా రాణించాడని కోహ్లీ కొనియాడాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా అతడు బాగా రాణించాడని అన్నాడు.

75 పరుగుల తేడాతో గెలవడం ఆశ్చర్యం వేసింది
‘మేము 75 పరుగుల తేడాతో గెలవడం మాకే ఆశ్చర్యం వేసింది. నేను రెండు సార్లు ఒకే విధంగా వికెట్ కోల్పోవడాన్ని గమనించాను. అక్కడ అంపైర్ బాగానే తన బాధ్యతలు నిర్వహించారు' అని కోహ్లీ అన్నాడు.

నేను ఎప్పుడూ హద్దులు మీరలేదు
'స్లెడ్జింగ్, ప్రత్యర్థులతో ఆడటం వేరువేరు. నేను ఎప్పుడూ మైదానంలో హద్దులు మీరలేదు. నాపై ప్రత్యర్థులు దృష్టిపెట్టిన విషయం జట్టులోని సహచర ఆటగాళ్లకు చెప్పాను. అది మా ఆటగాళ్లకు అవకాశంగా మార్చుకోవాలని చెప్పాను.

రహానే, పుజారాలు అద్భుతంగా ఆడారు
ప్రత్యర్థులు నాపై దృష్టిపెట్టినప్పుడు మీరు బాగా ఆడాలని చెప్పాను. దీనిని మా వాళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. రహానే, పుజారా బాగా ఆడారు' అని కోహ్లీ వారిద్దరపై ప్రశంసలు కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications