
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 63 పరుగుల తేడాతో గెలవడం ఓ మైలురాయి వంటిదని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు సిరీస్ ఆడుతున్న కోహ్లీ సేన రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. పరువు పోతుందనే భయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆడిందో లేక ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఆడిందో గొప్ప విజయాన్ని చేజిక్కుంచుకుంది.
ఇది మాకు ఓ స్వీటెస్ట్ విన్ అంటూ అభిప్రాయపడ్డాడు నాయకుడు విరాట్. 'దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ టెస్టులో భారత బౌలర్లు ఏ పరిస్థితుల్లో అయినా జట్టును గెలవగలమనే నమ్మకాన్ని సృష్టించారు. మేము గెలుస్తామనే నమ్మకంగానే ఉన్నాం. కానీ, అదే ఆడి చూపించాం. మీరు టెస్టు మ్యాచ్‌లలో ఓడిపోయారు కదా అని అడిగిన ప్రశ్నకు సమాదానంగా కోహ్లీ ఇలా అన్నాడు. అవును మేము ముందు ఓడిపోయాం. కానీ, విజయంతో ముగింపునిచ్చాం.' అంటూ కోహ్లీ బదులిచ్చాడు.
2014 సంవత్సరం లార్డ్స్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ను పోల్చి ఈ విధంగా అన్నాడు. మేము ఆడుతున్న వాండరర్స్ స్టేడియం కంటే లార్డ్స్ స్టేడియం చాలా అనువుగా ఉండే మైదానం అని పేర్కొన్నాడు.
కాగా, ఈ పిచ్ గురించి విరాట్‌తో పాటు కామెంటేటర్ మైకేల్ హోల్డింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్, భారత మాజీ క్రికెటర్ గంగూలీ సైతం పిచ్ బాగాలేదంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క అజింకా రహానెకు తప్ప మైదానం గురించి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలు అద్వితీయమైన ప్రతిభ చూపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.