షాకింగ్: కోహ్లీని జంతువులతో పోల్చిన ఆసిస్ మీడియా
న్యూఢిల్లీ: రెండో టెస్ట్ సందర్భంగా జరిగిన డీఆర్ఎస్ రగడపై ఇటు బీసీసీఐ, అటు క్రికెట్ ఆస్ట్రేలియా దాదాపు మరిచిపోయింది. బెంగళూరులో జరిగిన ఈ వివాదాన్ని ఆస్ట్రేలియా మీడియా మాత్రం మరిచిపోలేదు.
పైగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని జంతువులతో పోల్చుతూ విమర్శలకు దిగింది. ఆటపై దృష్టి పెట్టాలని బిసిసిఐ, క్రికెట్ ఆస్ట్రేలియా డీఆర్ఎస్ వివాదానికి ముగింపు పలికాయి. దీనిని ఆసిస్ మీడియా పట్టించుకోకపోవడం దారుణం

టెలిగ్రాఫ్ విమర్శలు
ది టెలిగ్రాఫ్ పత్రిక భారత కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేలపై సంచలనఆరోపణలు చేసింది. తమ అక్కసు వెళ్లగక్కింది. తాజాగా ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా తమ ఫేస్‌బుక్ ఖాతాలో కోహ్లీని జంతువులతో పోలుస్తూ ఓ ఫోటోని పోస్ట్ చేసి మరో వివాదానికి తెరలేపింది.

జంతువులతో పోలుస్తూ..
కోహ్లీ, పిల్లి, కుక్కపిల్ల, పాండా జంతువల ఫోటోతో వెటెల్ ఆఫ్ ది వీక్ అని పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్ 'ఇటీవల జరిగిన పరిణామాలు మన వెటెల్ ఆఫ్ ది వీక్ అవార్డుకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. పిల్లలు మీ తాతయ్యలను అడగండి. మిగిలిన విషయాలు మీకు తెలుసు' అని రాసింది.

ఫిర్యాదు ఉపసంహరణ
ఇఫ్పటికే బీసీసీఐ ఆటపై దృష్టి మరల్చకుండా ఉండేందుకు ఐసీసీకి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంది కూడా. ఓ వైపు వివాదాన్ని పక్కన పెట్టినా, మరోవైపు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటం ఆసిస్ మీడియాకు సరికాదంటున్నారు.

డుప్లెసిస్ ఆశ్చర్యం
మరోవైపు, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా బెంగళూర్‌లో మ్యాచ్‌లో చోటు చేసుకున్న డీఆర్ఎస్ వివాదంలో ఐసీసీ తీరును దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తప్పుబట్టాడు. సంఘటనకు సంబంధించి ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
సంఘటన అనంతరం డ్రెసింగ్ రూం వైపు కావాలని చూడలేదని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివరణ ఇచ్చాడు. ఇటువంటి చర్యలు స్టీవ్‌కు కొత్తేమీ కాదని విరాట్ కోహ్లీ అన్నాడు.

నోరు జారమని డేవిడ్ వార్నర్
భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లెవరూ నోరు జారరని ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. బెంగళూరు టెస్టులో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు నడిచిన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో వాగ్వాదాలు మామూలేనని, కానీ ఇకపై మేం అదుపులో ఉంటామని, రాంచి టెస్టులో మా వైపు నుంచి ఎవ్వరం నోరు జారబోమని, మరి టీమిండియా ఎలా ఉంటుందో చూద్దామని, ఏదేమైనా రెండు జట్లు క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నానని, డీఆర్‌ఎస్‌పై వివాదం రేగడం నిరాశ కలిగించే అంశమని, రాంచి టెస్టులో అన్నీ సద్దుమణుగుతాయని అనుకుంటున్నానని, తన వరకు తాను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానని, బ్యాటింగ్‌పైనే దృష్టి సారిస్తానని వార్నర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications