
హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టెస్టు సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్నప్పటికీ, వన్డే సిరిస్‌ను విజయంతో ప్రారంభించడంతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలి వన్డేలో 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ (112) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు. సఫారీ గడ్డపై కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, వన్డేల్లో 33వది కావడం విశేషం.
మరోవైపు విరాట్ కోహ్లీ 20 సెంచరీలను ఛేజింగ్‌లోనే సాధించడం విశేషం. 20 సెంచరీల్లో 18 సెంచరీలు జట్టుకు విజయాన్ని అందించాయి. కోహ్లీ తన కెరీర్‌లో మొత్తంలో విదేశీ గడ్డపై 15 సెంచరీలు చేశాడు. మ్యాచ్ అనంతరం నిర్వాహకులు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్న విరాట్ కోహ్లీ కార్యక్రమం ముగించుకుని తన డ్రస్సింగ్ రూమ్ వైపు వస్తుంటే అభిమానులు ఆటోగ్రాఫ్‌లు అడిగారు. వెంటనే కోహ్లీ వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. గతంలో స్వదేశంలో జరిగిన అనేక మ్యాచ్‌ల్లో కోహ్లీ భద్రతా సిబ్బందిని దాటుకుని అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండే ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం (ఫిబ్రవరి 4)న సెంచూరియన్ వేదికగా జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.