క్రికెట్ దిగ్గజాల సరసన చోటు: కోహ్లీ 1000 పరుగుల రికార్డు
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిరోజైన గురువారం పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ 2016/17 సీజన్‌లో 964 పరుగులు చేశాడు.

ఇస్లాం వేసిన 66వ ఓవర్‌లో ఈ ఘనత
బంగ్లాదేశ్ టెస్టులో పుజారా అవుటైన వెంటనే బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ బంగ్లాదేశ్ బౌలర్ ఇస్లాం వేసిన 66వ ఓవర్‌లో సింగిల్స్ తీసి తన ఖాతాలో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2016/17 సీజన్‌లో 1000 పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

కెప్టెన్‌గా కోహ్లీ ఏడో వాడు
అదేవిధంగా కెప్టెన్‌గా ఒక సీజన్‌లో 1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ఏడో వాడు కావడం విశేషం. గతంలో పాంటింగ్ (1,483), లారా (1,253), క్లార్క్ (1,178, 1,141) గ్రేమ్ స్మిత్(1,107) గ్రహమ్ గూచ్ (1,058), బాబ్ సిమ్సన్ (1,007) ఒకే సీజన్‌లో వెయ్యికి పైగా పరుగులు చేశారు.

భారత్ తరుపున కూడా ఏడవ వాడే
ఇక, భారత్ తరుపున చూస్తే ఏడవ ఆటగాడిగా కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. అంతక ముందు గౌతమ్ గంభీర్ (1,269), రాహుల్ ద్రవిడ్ (1,241, 1,006), మోహిందర్ అమర్‌నాథ్(1,182), గవాస్కర్ (1,179, 1,027), వీరేంద్ర సెహ్వాగ్ (1,128, 1,079) ఒకే సీజన్‌లో వెయ్యికి పైగా పరుగులు చేశారు.

ఒక సీజన్‌లో టెస్టుల్లో 1000కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు:
1105 - వీరేంద్ర సెహ్వాగ్ (2004/05)
1027 - సునీల్ గవాస్కర్ (1978/79)
1000 runs - విరాట్ కోహ్లీ (2016/17)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications