న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్, అశ్విన్‌కు దక్కని చోటు.. కోహ్లీపై విమర్శల వర్షం

IND vs WI 2019: Virat Kohli Gets Trolled For Axing Rohit Sharma And R Ashwin From India's Playing XI
Virat Kohli Gets Trolled For Axing Rohit Sharma and R Ashwin From Indias Playing XI

అంటిగ్వా: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంలో గురువారం వెస్టిండిస్‌, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తొలి టెస్టుకు 'హిట్ మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై ట్విట్టర్‌లో విమర్శల వర్షం కురుస్తోంది. పలువురు మాజీలు సైతం తీవ్రంగా విమర్శించారు.

<strong>సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!</strong>సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!

విబేధాలు అలానే ఉన్నాయా?

విబేధాలు అలానే ఉన్నాయా?

గత ప్రపంచకప్‌లో రోహిత్ సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు సెంచరీలు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. విండీస్ పర్యటనలో ఓ అర్ధ సెంచరీ చేసి మోస్తరుగా రాణించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అర్ధ సెంచరీ చేసాడు. అయినా కోహ్లీ.. రోహిత్‌ను పక్కనబెట్టాడు. దీంతో కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు అలానే ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డు:

వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డు:

అశ్విన్‌కు వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డే ఉంది. విండీస్‌పై ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన అశ్విన్‌ 60 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్లను నాలుగు సందర్భాల్లో సాధించాడు. అంతేకాకుండా 552 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. విండీస్‌పై ఆల్‌రౌండర్‌గా మంచి రికార్డు ఉన్న అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై కోహ్లీపై మండిపడుతున్నారు.

సొంత పగ కోసం:

సొంత పగ కోసం:

'విరాట్ కోహ్లీ నిజంగా ఒక ఇడియట్, స్టుపిడ్ కెప్టెన్ అని నిరూపించాడు. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవని కోహ్లీ.. రోహిత్ శర్మను పక్కన పెట్టాడు' అని ఓ అభిమాని ఘాటుగా విమర్శించాడు. 'కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు అలానే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. 'కోహ్లీకి ఇష్టమైన, విఫలమైన ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నాడు. కానీ.. రోహిత్ లేడు. కోహ్లీ సొంత పగ కోసం జట్టును నాశనం చేస్తున్నాడు' అని ఓ అభిమాని మండిపడ్డాడు.

Story first published: Friday, August 23, 2019, 12:47 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X