Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ బర్త్ డే స్పెషల్: ఓ అభిమాని గిప్ట్ చూడండి

బెంగుళూరు: టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శనివారం (నవంబర్ 5)న 28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కోహ్లీ మయమైన ట్విట్టర్: సెహ్వాగ్ సరదా ట్వీట్ ఇదే

కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకకు చెందిన కరణ్ ఆచార్య అనే కళాకారుడు ఓ అరుదైన చిత్రాన్ని కానుకగా సిద్ధం చేశాడు. డూడుల్‌ (గీచిన చిత్రం) తరహాలో విరాట్ కోహ్లీకి సంబంధించి అన్ని విధివిధానాలను అందులో పొందుపరిచాడు.

Virat Kohli gets a special gift from Bengaluru ahead of his birthday

రన్ మెషిన్: 28వ పడిలోకి కోహ్లీ, సాధించిన రికార్డులివే

కోహ్లీ బ్యాటింగ్‌ స్టయిల్‌, టాటూ, బ్యాట్‌, వికెట్‌, జెర్సీ నెంబర్, అనుష్కతో ప్రేమ, బీసీసీఐ లోగోతో పాటు క్రికెట్‌ మైదానం ఉండేలా రూపొందించిన ఈ డూడుల్‌లో 'హ్యాపీ బర్త్‌ డే టు విరాట్‌కోహ్లీ' అనే పదాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ డూడుల్ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో కోహ్లీ లైఫ్ స్టయిల్ మొత్తం ఉంది.

స్వతహాగా యానిమేషన్ అంటే ఇష్టపడే కరణ్ ఆచార్యకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. క్రికెటర్ కోహ్లీ అంటే ప్రాణం. దీంతో తన అభిమాన క్రికెటర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కరణ్‌ ఆచార్య తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+