మెల్బోర్న్: అడిలైడ్ ఓవల్ మైదానంలో ఈ నెల 26వ తేదీన జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో తనను వెనక్కి పంపించినప్పుడు భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కాస్తా ఎక్కువగా ప్రతిస్పందించాడని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అన్నాడు.
తాను కొట్టిన బంతిని క్యాచ్‌గా పట్టుకున్న తర్వాత కోహ్లీ కోపంతో తనకు వీడ్కోలు పలికాడని ఆయన చెప్పాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేసిన స్మిత్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ అసంతృప్తికి గురైనట్లు సమాచారం.
రవీంద్ర జడేజా వేసిన బంతిని స్మిత్ గాలిలోకి లేపడంతో విరాట్ కోహ్లీకి క్యాచ్ దొరిగింది. దాంతో క్యాచ్ పట్టుకున్న కోహ్లీ కుడి చేతితో స్మిత్ ఎక్కువగా మాట్లాడుతున్నాడనే సంకేతాన్ని ఇచ్చాడు. కోహ్లీ అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదని, అయితే కాస్తా ఉద్వేగానికి గురైనట్లు ఉన్నాడని స్మిత్ అన్నాడు.

ఓ ఆటగాడు అవుటైనప్పుడు అలా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఆయన ఫాక్స్ స్పోర్ట్స్‌తో అన్నారు. కోహ్లీ కాస్తా ఉద్వేగానికి గురైన మాట వాస్తవం కాదా అని అడిగాడు. తాను బ్యాడ్ షాట్ కొట్టానని అంగీకరించాడు. సిక్స్ లేదా ఫోర్ కొట్టాలని ప్రయత్నించానని, అది తన తప్పిదమేనని, వచ్చేసారి కాస్తా జాగ్రత్తగా ఆడుతానని అన్నాడు.
రెండో ట్వంటీ20 మ్యాచు ఈ నెల 29వ తేదీన జరగనుంది. మూడు ట్వంటీ20 మ్యాచుల సరీస్ జనవరి 31వ తేదీ మ్యాచుతో ముగుస్తుంది. భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0 స్కోరుతో ముందుంది.