విరాట్ కొత్త హెయిర్ స్టైల్ చూశారా!.. ఓ లుక్కేయండి
న్యూఢిల్లీ : విరాట్ ఆట అంటే పడి చచ్చే అభిమానులు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మహిళా అభిమానుల ఫాలోయింగ్ కూడా కోహ్లికి ఎక్కువే. అందుకే గ్యాలరీల్లోంచి 'విరాట్ విల్ యూ మ్యారీ మి 'అన్న ప్లకార్డులు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. ఆటపై ఎంతగా ఫోకస్ పెడుతాడో.. అందంపై కూడా అంతే ఫోకస్ చేస్తాడు విరాట్.
అందుకే.. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు తన ఆహార్యాన్ని, గెటప్ ను మార్చేస్తుంటాడు. తాజాగా న్యూజిలాండ్ పర్యటన కోసం.. మరో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రెడీ అయిపోయాడు విరాట్. సినిమా సినిమాకు హీరోలు గెటప్ లు మార్చినట్లు.. ప్రతీ సిరీస్ కు కొత్త హెయిర్ స్టైల్ తో మైదానంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడేమో బుహుశా!
ఇక విరాట్ న్యూ హెయిర్ స్టైల్ విషయానికొస్తే.. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అపెనీ జార్జ్ విరాట్ కు ఓ న్యూ హెయిర్ స్టైల్ పరిచయం చేశాడు. ఈ స్టైల్ ఎలా ఉందంటే.. జుత్తును స్ట్రెయిట్ నింగ్ చేయించుకుని దగ్గరకు కత్తిరించుకున్నాడు. ఇటీవలే యువరాజ్ కూడా జార్జ్ వద్దే హెయిర్ కట్ చేయించుకోవడం విశేషం. కాగా, తన న్యూ హెయిర్ స్టైల్ ఫోటోలను విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications