
హైదరాబాద్: ఒకప్పట్లా లేదు. ఏం జరిగినా నిమిషాల్లో స్పందిస్తున్నారు నెటిజన్లు. తమ అభిమాన తారలనో, క్రికెటర్లనో ఫాలో అవుతూ నచ్చని వారిపై విమర్శలు గుప్పిస్తూ తమ సరదాను తీర్చుకుంటున్నారు. మొన్నా మధ్య విరాట్ కోహ్లీ, అనుష్కల గురించి ఇలానే వెల్లువల్లా కామెంట్లు చేసిన నెటిజన్లు మళ్లీ కేప్ టౌన్‌లో జరుగుతున్న తొలిటెస్టుపై అదే విధంగా కామెంట్లు చేస్తున్నారు.
మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. మహాత్ముడే దక్షిణాఫ్రికా గడ్డపై రాణించలేకపోయాడు. ఇక కోహ్లీ ఒక లెక్కా. అని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.