
అసలింతకు ఏం జరిగిందంటే..
భారత్ వర్సెస్ లీసెస్టర్‌షైర్ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ మూడో రోజు కమలేష్ నాగర్‌కోటి లీసెస్టర్ షైర్ తరఫున బౌలింగ్ చేశాడు. ఇక కమలేష్ ఫీల్డింగ్ టైంలో బౌండరీ లైన వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ ప్రేక్షకుడు కమలేష్ నాగర్‌కోటిని ఎగతాళి చేస్తూ కన్పించాడు. కమలేష్ ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అంటూ తీవ్రంగా అరిచాడు. ప్లీజ్ నీకోసమే ఇక్కడికొచ్చానంటూ చిర్రెత్తించేలా మిస్ బిహేవ్ చేశాడు. అతను అలా కమలేష్‌ను విసిగెత్తించడం డ్రెస్సింగ్ రూంలో నుంచి విరాట్ కోహ్లీ చూశాడు. వెంటనే బాల్కనీలోకి వచ్చాడు. ఆ అభిమాని మీద నీకు మ్యానర్స్ ఉందా.. ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్‌ను ఎందుకలా ఇరిటేట్ చేస్తావ్ అంటూ కడిగిపారేశాడు.

సెల్ఫీ కోసం ఓవరాక్షన్
ఎగతాళి చేసిన ఆ వ్యక్తి కాసేపు కోహ్లీతో కూడా వాదించాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఎటాకింగ్ క్వశ్చన్లతో అతని నోరు మూయించాడు. కమలేష్ నాగర్‌కోటితో ఒక ఫోటో దిగాలని ఆశపడుతున్నాను. ఈ మ్యాచ్ చూడ్డానికి నేను ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వచ్చాను. కనీసం అతను నాతో ఒక్క సెల్ఫీ దిగితే ఏం పోతుంది. అందుకే అతన్ని నేను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ అతను హిందీలో కోహ్లీతో వాదించాడు. ఇక ఇంతలో కోహ్లీ అందుకుని.. అరె బాయ్.. అతను మ్యాచ్ ఆడటానికి వచ్చాడా లేదా నీతో ఫోటోలు దిగడానికి వచ్చాడా.. అంటూ హిందీలో గట్టిగా అన్సర్ ఇచ్చాడు. దీంతో దెబ్బకు ఆ అభిమాని సైలెంట్ అయిపోయాడు.
కోహ్లీ బుద్ధి చెపుతున్న వీడియో నెట్టింట వైరల్
ఇక కోహ్లీ బాల్కనీ నుంచి సదరు అభిమానికి బుద్ధి చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు అభిమాని కావాలనే కమలేష్ నాగర్‌కోటీని విసిగిస్తున్నాడని కోహ్లీ గ్రహించి అతనికి అండగా నిలబడ్డానికి బాల్కనీ దాకా వచ్చి బుద్ధి చెప్పడం విశేషం. ఎందుకంటే కమలేష్ నాగర్ కోటీ అంత పెద్ద పాపులార్ ప్లేయరేం కాడు.. కమలేష్ ప్లీజ్ ఒక్క సెల్ఫీ అంటూ పదే పదే ఆ అభిమాని కావాలని విసిగిస్తున్నట్లు అక్కడున్న వారికి అందరికీ అర్థమవుతుంది. దీంతో అందరూ ఏమనలేకపోయినా.. కోహ్లీ స్టాండ్ తీసుకుని ప్రేక్షకుణ్ని వారించాడు. ఆటగాడు స్వేచ్ఛగా ఆడేలా చేశాడు.

కోహ్లీ ప్లేయర్ మాత్రమే కాదు..
ఇక గతంలో కూడా బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత మళ్లీ ఆట మొదలెట్టిన స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి చీటర్ చీటర్ అంటూ ప్రేక్షకులు అరుస్తుంటే కోహ్లీ కలగజేసుకున్నాడు. నోరు మూయండి అతను మనస్ఫూర్తిగా తన తప్పు ఒప్పుకుని క్రికెట్ ఆడుతుంటే.. ప్రోత్సహించాల్సింది పోయి ఇలా అతన్ని కించపరుస్తారా అంటూ కోహ్లీ సైగలతో చెప్పేసరికి ఒక్కసారిగా స్టేడియం గమ్మున ఉండిపోయింది. కోహ్లీ ప్లేయర్‌గా మాత్రమే కాదు.. క్రీడా స్ఫూర్తిని చాటడంలోనూ, తోటి ప్లేయర్లకు అండగా నిలబడడంలోనూ కింగే.


Click it and Unblock the Notifications
