Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య మళ్లీ రచ్చ?.. వీడియో వైరల్

దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం విరాట్ కోహ్లీ స్టేడియంలో వ్యక్తం చేసి హావభావాలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సహచర ఆటగాళ్లు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఉత్సాహంగా ఆలింగనం చేసుకున్న విరాట్ కోహ్లీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కేవలం కరచాలనంతోనే సరిపెట్టడం పలు అనుమానాలకు దారితీసింది.

గంభీర్-కోహ్లీ మధ్య వివాదం మళ్లీ మొదలైందా?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ (302 పరుగులు, 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ) అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే జట్టు విజయం తర్వాత ఆటగాళ్ల మధ్య జరిగే సహజమైన కౌగిలింతలు, ఆత్మీయ పలకరింపుల సమయంలోనే ఈ 'వివాదం' వెలుగులోకి వచ్చింది.

Virat Kohli Gautam Gambhir Tension Sparks Again Viral Video from IND vs SA ODI

మ్యాచ్ ముగిశాక, విరాట్ కోహ్లీ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందిని కలుస్తూ వచ్చాడు. సహచర ఆటగాళ్లందరినీ ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను, విరాట్ నవ్వుతూ, ఉల్లాసంగా కౌగిలించుకున్నాడు. ఈ సన్నివేశాలు ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలను స్పష్టం చేశాయి. కానీ కోహ్లీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలుస్తున్నప్పుడు అతని హావభావాలు స్పష్టంగా మారిపోయాయి. కోహ్లీ గంభీర్‌ను కౌగిలించుకోకుండా, కేవలం కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయడంతోనే సరిపెట్టాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు దీన్ని చూసి గంభీర్, కోహ్లీల మధ్య మరోసారి విభేధాలు నెలకొన్నట్లు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన ఈ మార్పు, హెడ్ కోచ్‌తో కోహ్లీకి ఉన్న విభేదాలనుమరోసారి బహిర్గతం చేసిందని విశ్లేషిస్తున్నారు.

కోచ్‌తో కోహ్లీ సంబంధాలు సరిగా లేవా?
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవని గత కొంతకాలంగా రిపోర్టులు వస్తున్నాయి. గతంలో ఐపీఎల్‌లో వీరు బహిరంగంగా గొడవ పడటం, అలాగే కోచ్ గంభీర్ 'స్ప్లిట్ కోచింగ్' (టెస్ట్‌కు వేరే కోచ్) గురించి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ యజమానితో వివాదంలో పడిన నేపథ్యం కూడా ఉంది. జట్టు విజయం తర్వాత కోహ్లీ ప్రదర్శించిన ఈ ప్రత్యేక వైఖరి, జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో ఒక రకమైన అంతర్గత ఉద్రిక్తత కొనసాగుతోందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

తదుపరి మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మళ్లీ యాక్షన్‌లో కనిపిస్తారు.

Story first published: Sunday, December 7, 2025, 14:29 [IST]
Other articles published on Dec 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+