టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. కుర్రాళ్లకు చాలా ఫ్రీడం ఇచ్చే కోహ్లీని కుర్ర ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆటపట్టించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా సంబరాలు చేసుకుంది.
ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా సభ్యులు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో ఇషాన్ కిషన్ ఏదో మాట్లాడుతూ కోహ్లీ ఎలా నడుస్తాడో చూపించాడు. అది చూసిన టీం సభ్యులంతా నవ్వేశారు. అయితే తను అలా నడవనంటూ కోహ్లీ ఆబ్జెక్ట్ చేశాడు.

దీంతో తన పొరపాటు సరి చేసుకున్న ఇషాన్ మరోసారి కోహ్లీ స్టైల్‌లో నడిచి చూపించాడు. ప్రేమదాస్ స్టేడియంలో మ్యాచ్ ముగిశాక కూడా టీంను చూస్తుండిపోయిన ఫ్యాన్స్‌లో ఒకరు దీన్ని వీడియో తీశారు. ఇషాన్ ఇలా కోహ్లీని ఇమిటేట్ చేయడం చూసిన ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోయారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ కూడా పగలబడి నవ్వుతున్నారు. ముఖ్యంగా కిషన్ మిస్టేక్స్ చూపించడానికి కోహ్లీ ఎగతాళి చేయడం అయితే మరీ ఫన్నీగా ఉందంటున్నారు. ఆ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్.. కోహ్లీని కౌగిలించుకొని పగలబడి నవ్వాడు.
అప్పటికీ కోహ్లీ కూడా పూర్తిగా ఫన్నీ మూడ్‌లోకి వచ్చేసి కిషన్‌ను వెక్కిరిస్తూ మిమిక్రీ చేశాడు. దీంతో టీం సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ కూడా తమ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక ఫైనల్‌లో రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కిషన్.. గిల్‌తో కలిసి 51 పరుగుల టార్గెట్‌ను కేవలం 6.1 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే.
అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో కూడా కోహ్లీ ఇలాగే సరదాగా కనిపించాడు. ఆ మ్యాచులో విశ్రాంతి తీసుకున్న అతను.. టీంమేట్స్‌కు డ్రింక్స్ అందించాడు. ఈ సమయంలో ఫన్నీగా పరిగెడుతూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయింది.