కివీస్‌పై కోహ్లీసేన చరిత్ర: గర్వంగా ఉందన్న కోహ్లీ
హైదరాబాద్: న్యూజిలాండ్‌పై టీ20 సిరిస్‌ను గెలవడం చాలా గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి కివీస్‌పై టీ20 సిరిస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ న్యూజిలాండ్‌పై సిరీస్ నెగ్గడం ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. 'కివీస్‌తో వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో కొన్ని గెలిచాం, కొన్ని ఓడాం. ఇప్పుడు మాత్రం చాలా గర్వంగా ఉంది. ఈ రెండు సిరీస్‌లను మేమే గెలిచాం. మూడో టీ20 జరిగిన గ్రీన్ ఫీల్డి స్టేడియం బాగుంది. ఔట్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంది' అని కోహ్లీ మెచ్చుకున్నాడు.

ఆశ్చర్యంగా ఉందన్న కోహ్లీ
'ఇక, మూడో టీ20కి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించలేదని తెలిసి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆఖరి టీ20లో అభిమానులు మంచి మ్యాచ్‌ని వీక్షించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అభిమానులు మంచి యాక్షన్ చూశారు. వన్డే సిరీస్ ప్రారంభం నుంచి కివీస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నాం' అని కోహ్లీ చెప్పాడు.

చరిత్ర సృష్టించిన కోహ్లీసేన
తాజా సిరిస్ విజయంతో కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. 2015 అక్టోబర్ నుంచి చూస్తే భారత్ స్వదేశంలో ఒక్క అంతర్జాతీయ సిరీస్ కూడా ఓడిపోలేదు. గత రెండేళ్లకు పైగా కాలం నుంచి స్వదేశంలో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆసీస్‌లపై టెస్టు సిరీస్‌లు గెలిచింది.

న్యూజిలాండ్ సైతం అద్భుత ప్రదర్శన
ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను సైతం కైవసం చేసుకుంది. ఇక భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కూడా ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. దాదాపు గత మూడేళ్లుగా ఒక్క ద్వైపాక్షిక టీ20(రెండు, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు) సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ ఓడిపోలేదు.

గత ఎనిమిది టీ20 సిరిస్‌ల్లో ఓటమిలేని కివీస్
గత ఎనిమిది ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో న్యూజిలాండ్ ఒక్క సిరీస్‌ను కూడా ఓడిపోలేదంటే టీ20ల్లో న్యూజిలాండ్ సత్తా ఏంటో అర్ధం అవుతుంది. మరోవైపు ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై టీ20 సిరిస్ గెలిచిన చరిత్ర భారత్‌కు కూడా లేదు. ఇన్నాళ్లకు న్యూజిలాండ్‌పై టీ20 సిరిస్ గెలిచిన సందర్భంలోనే కోహ్లీ సైతం చాలా గర్వంగా ఉందని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications