భారత క్రికెట్ తో పాటు టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీతో ఇంగ్లాండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ కు మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే చాలా సార్లు విరాట్ పై ప్రశంసలు కురిపిస్తూ, అతడికి మద్దతుగా కూడా నిలుస్తుంటాడు పీటర్సన్. అయితే తాజాగా వీరిద్దరి అనుబంధం ఎంత గట్టిదో తెలియజేసేలా ఓ వీడియో బయటకు వచ్చి క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంటోంది.
వీడియోలో ఏముందంటే?
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మోకాలి వాపు కారణంగా విరాట్ కోహ్లీ ఆడలేదు. కానీ మోకాలి పట్టీ కట్టుకుని మరీ.. డగౌట్ లో నుంచి తన టీమ్ ను ఉత్సాహపరచడంతో పాటు తన చర్యలతో క్రికెట్ అభిమానులను తెగ అలరించాడు. ఇదే సమయంలో మ్యాచ్ విజయం తర్వాత మైదానం అంతా ఉత్సాహంతో తిరుగుతూ ఎంతో సరదాగా కనిపించాడు విరాట్. ఈ క్రమంలోనే అతడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ తో కలిసి కూడా కాసేపు సరదాగా ముచ్చటిస్తూ ఫన్నీ అట్మాస్పియర్ క్రియేట్ చేశాడు. పీటర్సన్ ను కాసేపు ఆటపట్టిస్తూ నవ్వులు పూయించాడు. మొత్తంగా వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలీదు కానీ.. కాసేపు సరదగా సరదగా తమ పరస్పర చర్యలతో తెగ నవ్వుకున్నారు.

వీడియోలో విరాట్ తన మోకాలి వాపు గురించి వివరిస్తూనే.. పీటర్సన్ ను ఆట పట్టించాడు. పీటర్సన్ పైవు వేలు చూపించి, అతడిని గుండెలపై సరదాగా కొడుతూ, తన చేతిని తిప్పబోయాడు. విరాట్ చర్యలకు పీటర్సన్ కూడా తెగ నవ్వుతూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో క్రికెట్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. కోహ్లీ-పీటర్సన్ బాండింగ్ కు ఫిదా అయిపోయి దానిని తెగ షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.