Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2020 స్పెషల్: సరికొత్త హెయిర్‌ స్టైల్‌లో కోహ్లీ.. ఫాన్స్ ఫిదా!!

Virat Kohli Flaunts New Haircut Ahead Of Sri Lanka T20Is

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కొత్త సంవత్సరంలో సరికొత్తగా రాబోతున్నాడు. ఈ ఏడాదిని కొత్తగా ఆరంభించాలని అనుకున్న కోహ్లీ.. సరికొత్త హెయిర్‌ స్టైల్‌తో దర్శనమివ్వనున్నాడు. కోహ్లీ తాజాగా 'టాప్‌ కట్‌' అనే హెయిర్‌ కట్‌ను చేయించుకున్నాడు. స్టార్ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హాకీమ్‌ ఈ 'టాప్‌ కట్‌' హెయిర్‌ కట్‌ను చేసాడు.

సరికొత్త లుక్‌లో కోహ్లీ

సరికొత్త లుక్‌లో కోహ్లీ

శ్రీలంకతో జనవరి 5న (ఆదివారం) టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న సందర్భంగా కోహ్లీ తన కొత్త లుక్‌తో అభిమానులలో జోష్ నింపనున్నాడు. ఈ సరికొత్త లుక్‌కు సంబందించిన పోటోలను హకీమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. 'న్యూ ఇయర్.. న్యూ కట్.. ది కింగ్' అని హకీమ్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కోహ్లీ కొత్త లుక్‌ని చూసి అభిమానులు అందరూ షాకవతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫొటోలకు చాలా లైకులు, కెమెంట్లు వచ్చాయి.

టెర్రిఫిక్‌ స్టైల్‌

టెర్రిఫిక్‌ స్టైల్‌

కోహ్లీ కొత్త లుక్‌కి హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌ సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌ ‘టెర్రిఫిక్‌' అంటూ కామెంట్‌ చేశాడు. నిజానికి స్టైల్‌కు పెట్టింది పేరు కోహ్లీ. ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్‌ను అనుకరించడంలో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోడు. సరికొత్త స్టైల్‌లతో మెస్మరైజ్ చేసే కోహ్లీ లుక్‌ని ఫాలో అయ్యే హీరోలు కూడా ఉన్నారు. రికార్డుల రారాజుగా పేరుతెచ్చుకున్న కోహ్లీ ఏది చేసినా సంచలనమే మరి.

ర్యాంకింగ్స్‌లో టాప్‌

ర్యాంకింగ్స్‌లో టాప్‌

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐసీసీ టెస్టు, వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. టీ20లలో మాత్రం టాప్-10లో ఉన్నాడు. ఆదివారం నుంచి భారత్‌-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు గురువారం గువాహటికి చేరుకుంది. పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య మలింగ సేన హోటల్‌కు చేరుకుంది. శుక్రవారం టీంఇండియా క్రికెటర్లు బ్యాచ్‌లుగా చేరుకునే అవకాశముంది.

శుభారంభం చేయాలని టీమిండియా

39వేల సీటింగ్‌ సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఇప్పటికే 27వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. భారత్‌, శ్రీలంక మ్యాచ్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రెండు జట్లకు ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ ఉంటుంది. గతేడాదిని ఘనంగా ముగించిన టీమిండియా.. ఈ ఏడాదిలో శ్రీలంకపై గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది.

Story first published: Friday, January 3, 2020, 15:59 [IST]
Other articles published on Jan 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+