Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : కొత్త టాటూ.. కొత్త లుక్‌తో కోహ్లీ.. సూపర్ అంటున్న ఫ్యాన్స్!

Virat Kohli flaunts his new tattoo before IPL 2023

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కొత్తగా కనిపిస్తున్నాడు. గతేడాది ఆసియా కప్ నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న అతను.. ఇప్పటికీ తన పూర్తి ఫామ్ అందుకున్నట్లు కనిపించడం లేదు. కోహ్లీ కూడా అదే విషయం చెప్పాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కోసం రెడీ అవుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ కోసం చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నాడు. ఈ కార్యక్రమం తర్వాత ఆర్సీబీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటాడు.

ఈ ఈవెంట్‌ కోసం బెంగళూరు చేరుకున్న కోహ్లీ.. ఎయిర్‌పోర్టులో కొత్తగా కనిపించాడు. ఐపీఎల్ 2023 ముందు తన హెయిర్ స్టైల్ మార్చుకున్న అతను.. చేతిపై కొత్త టాటూతో కనిపించాడు. కుడి మోచేయి కింద ఉన్న ఈ టాటూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. మధ్యలో విచ్చుకున్న పువ్వుతో ఉన్న ఈ టాటూ సూపర్‌గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. చాలా సింపుల్ డ్రెస్‌లో కనిపించిన కోహ్లీ లుక్ కూడా వారికి బాగా నచ్చింది.

ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ కోసం కోహ్లీతోపాటు ఈ ఫ్రాంచైజీ మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్ కూడా బెంగళూరు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలోనే గేల్, డివిల్లీర్స్ ఇద్దరినీ 'ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చుకుంటారు. అలాగే ఈ సందర్భంగా ఆర్సీబీ నుంచి ఒక ఆసక్తికర ప్రకటన కూడా ఉంటుందని కోహ్లీ హింట్ ఇచ్చాడు. కానీ అదేంటో మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తన ఫామ్ గురించి తాజాగా మాట్లాడిన కోహ్లీ.. మళ్లీ తను పాత రోజుల్లో ఆడినట్లే ఆడటం మొదలు పెట్టానని చెప్పాడు. కానీ ఇంకా పూర్తి ఫామ్‌కు చేరుకోలేదని, ఇది తన బెస్ట్ కాదని కూడా స్పష్టం చేశాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌తో తను మళ్లీ బెస్ట్‌కు చేరుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది మంచి బలంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తోంది. అభిమానులు కూడా తమ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గితే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Story first published: Sunday, March 26, 2023, 12:40 [IST]
Other articles published on Mar 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+