Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు: చరిత్రలో ఒకే ఒక్కడు!

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7x4, 6x6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3x4, 6x6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5x4, 1x6) రాణించాడు.

పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38), అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లికి రెండు సార్లు లైఫ్ లభించింది. పరుగుల ఖాతా తెరవకముందు, 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు విరాట్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు.

Virat Kohli First Player in IPL History to Score 1000 Runs Against Three Opponents

సొగసైన బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లి సెంచరీని చేజార్చుకున్నాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే శతకాన్ని సాధించినప్పటికీ ఈ రన్ మెషిన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు ప్రత్యర్థి జట్లపై 1000+ పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు.

కోహ్లి పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్స్‌పై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. కాగా, ఈ అరుదైన జాబితాలో కోహ్లి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (కేకేఆర్, ఢిల్లీ), డేవిడ్ వార్నర్ (కేకేఆర్, పంజాబ్) ఉన్నారు. వీరిద్దరు రెండు జట్లపై వెయ్యి పరుగులు బాదారు.

అంతేగాక కోహ్లి మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600+ పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ సరసన కోహ్లి నిలిచాడు. విరాట్, రాహుల్ నాలుగు సీజన్లలో 600కు పైగా పరుగులు సాధించాడు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ చెరో మూడు సార్లు, డుప్లెసిస్ రెండు సార్లు ఈ ఘనత అందుకున్నారు.

Story first published: Thursday, May 9, 2024, 22:09 [IST]
Other articles published on May 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+