ఫోటోలు: కోహ్లీ వంద కోట్ల ఒప్పందం ఏంటో తెలుసా?
హైదరాబాద్: ఆటలో సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదనలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా ఇంతవరకు ఏ క్రికెటర్ కూడా సొంతం చేసుకోని వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుని కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
జర్మనీకి చెందిన స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ పూమాతో ఎనిమిదేళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా దేశంలో ఒకే బ్రాండ్‌తో ఏకంగా రూ.100 కోట్ల ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఎనిమిది సంవత్సరాలకు గాను పూమాతో కోహ్లీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంతో కోహ్లీ జమైకా పరుగుల వీరులు ఉసెన్‌బోల్ట్, అసఫా పోవెల్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్ గిరౌడ్‌ల సరసన చేరాడు. ఈ ఒప్పందం ప్రకారం కోహ్లీకి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఆఫర్ చేసింది.

గౌరవంగా ఉంది
ఈ ఒప్పందం సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పూమాతో చాలాకాలం ఒప్పందం కుదుర్చుకున్నానని, పూమా భారత్‌లో అతి తక్కువ కాలంలో పాపులారిటీ పొందడం తనను ఆకట్టుకుందని, గొప్ప చరిత్ర కలిగిన ఆటగాళ్లు సరసన తాను చేరడం గౌరవంగా ఉందని అన్నాడు.

ఉసేన్ బోల్ట్ సహా ఎంతో మంది దిగ్గజాలు
ఉసేన్ బోల్ట్‌తో పాటు గతంలో సంస్థతో ఒప్పందం చేసుకున్న పీలే, మారడోనా, హెన్రీతో పాటు మరికొంతమంది సంస్థతో పనిచేశారని కోహ్లి ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా, స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ అయిన అడిడాస్‌తో 2013లో కోహ్లీ ఏడాదికి రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన కోహ్లీ
ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగింది. తర్వాత ఈ ఒప్పందం పునరుద్దరించకపోవడంతో పూమాతో తాజాగా కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజా ఒప్పందంతో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిల తర్వాత వివిధ స్పోర్ట్స్, ఏజెన్సీల ఒప్పందాలతో కలిపి కోహ్లీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు.

సచిన్ అత్యధికంగా 50 కంపెనీలకు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 50 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. సచిన్ 1995లో వరల్డ్‌టెల్‌తో అత్యధికంగా రూ.30 కోట్లకుపైగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2001లో ఇదే ఒప్పందాన్ని డబుల్ రేటుతో పునరుద్ధరించుకున్నాడు.

సచిన్ తర్వాత ఆ స్ధానాన్ని ఆక్రమించిన ధోని
సాచి, సాచిస్ కంపెనీలకు ప్రచారకర్తగా 2006లో సచిన్ టెండూల్కర్ మూడు సంవత్సరాలకు గాను రూ.175 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికిన తర్వాత ఆ స్ధానాన్ని మహేంద్ర సింగ్ ధోని ఆక్రమించాడు. సచిన్ తర్వాత బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని రూ.180 కోట్లు ఆర్జించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications