For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో టెస్ట్: కోహ్లీ వన్ మాన్ షో, డబుల్ సెంచరీ, రికార్డులు, భారత్ భారీ స్కోర్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట తొలి గంటలో భారత జట్టు వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. ఓవర్ నైట్ బ్యాట్సుమెన్ శ్రీలంక బౌలర్లను ఎదుర్కొన్నారు.

Virat Kohli first captain to smash 10 international hundreds in a calendar year

నాగపూర్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో 176.1 ఓవర్లు ఆడిన భారత్‌ 610/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో భారత్‌కు 405 పరుగుల మంచి ఆధిక్యం లభించింది.

ఇన్నింగ్స్‌ 177వ ఓవర్‌ తొలి బంతికి మూడు పరుగుల సాధించి రోహిత్‌ శర్మ శతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డిక్లేర్‌ చేసి శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించాడు.

భారత తొలిఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి(213), పుజారా(143), మురళీ విజయ్‌(128) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటింగ్‌కు దిగి 1 వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. ఆ తర్వాత మూడో రోజు మ్యాచ్ ముగిసింది.

అంతకుముందు, కోహ్లీ వన్ మాన్ షో ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచులో కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. అతనికి ఇది ఐదో డబుల్. 259 బంతుల్లో డబుల్ కొట్టాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 583 వద్ద ఉన్నప్పుడు కోహ్లీ (213) ఐదో వికెట్‌గా అవుటయ్యాడు.

తొలి గంటలో భారత జట్టు వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. ఓవర్ నైట్ బ్యాట్సుమెన్ శ్రీలంక బౌలర్లను ఎదుర్కొన్నారు. పుజారా, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడారు. కోహ్లీ సెంచరీ చేశాడు. కోహ్లీకి ఇది 19వ సెంచరీ. కోహ్లీ 130 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో 10 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. తొలి ఇ్ననింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులకు ఆలౌట్ అయింది.

Story first published: Sunday, November 26, 2017, 17:21 [IST]
Other articles published on Nov 26, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+