ఆరు సెంచరీలు: కాన్పూర్ వన్డేలో కోహ్లీ నెలకొల్పిన రికార్డులివే
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
202వ వన్డేల్లో విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించాడు. కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో 83 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లీ ఈ ఘనత సాధించాడు. తద్వారా వన్డేల్లో 9 వేల పరుగులు చేసిన ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

వన్డేల్లో 9వేల పరుగులు
కోహ్లీకి ముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజహరుద్దీన్, ధోని 9 వేల పరుగులు చేశారు. కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ తన 194వ ఇన్నింగ్స్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గతంలో 205 ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగులు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు
దీంతో పాటు మరో రెండు రికార్డుల్ని కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. 2017లో రెండు వేల అంతర్జాతీయ పరుగుల్ని పూర్తి చేశాడు. తద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 1991 పరుగులతో ఉన్న కోహ్లీ మరో తొమ్మిది పరుగులు చేసి ఈ ఏడాది రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఈ ఏడాది వన్డేల్లో 1000కిపైగా పరుగులు
2017లో కోహ్లీకి ఇది 40వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఏడాది కేవలం వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఇక టెస్టుల్లో ఇప్పటివరకు 449 పరుగులు, టీ20ల్లో 195 పరుగులు చేశాడు. 2017లో 26 వన్డేలాడిని కోహ్లీ 1460 పరుగులు చేశాడు.

కెప్టెన్‌గా కోహ్లీ ఆరు సెంచరీలు
కాన్పూర్ వేన్డేలో కోహ్లీ తన కెరీర్‌లో 32వ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ కెప్టెన్‌గా కోహ్లీ ఆరు సెంచరీలు నమోదు చేశాడు. దీంతో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications