Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి గాయం - ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉందంటే?

Kohli Injured: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిగ్ షాక్ తగిలింది! ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయమైంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆర్సీబీ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. విరాట్ గాయం తీవ్రత ఎలా ఉంది, ఇప్పుడతడి పరిస్థితి ఎలా ఉంది, నెక్ట్స్ మ్యాచ్ అతడు ఆడగలడా అని ఆరా తీస్తున్నారు.

కోహ్లీకి ఏమైందంటే?
మ్యాచ్ 12వ ఓవర్ లో కృనాల్ పాండ్య వేసిన షార్ట్ బంతికి సాయి సుదర్శన్ పుల్ ఆన్ ఆడాడు. అయితే ఆ బాల్.. డీప్ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ చేతి వేలికి తాకింది. బంతిని అందుకోబోతుంటే రైట్ హ్యాండ్ ఫింగర్ కు తాకింది. వెంటనే ఆ బాల్ బౌండరీకి వెళ్లగా, దెబ్బ తాకిన కోహ్లీ వెంటనే నొప్పితో మోకాలి మీద కూర్చుండి పోయాడు. దీంతో తక్షణమే ఆర్సీబీ మెడికల్ స్టాఫ్ మైదానంలో వచ్చి విరాట్ కు ప్రాథమిక చికిత్స అందించింది.

Virat Kohli finger injury updated in Royal Challengers Bengaluru vs Gujarat Titans match IPL 2025

కోహ్లీ గాయం తీవ్రత ఎలా ఉందంటే?
కోహ్లీకి వేలికి దెబ్బ తాకగానే పెయిన్ కిల్లర్ స్ప్రే లాంటి వేశారు మెడికల్ స్టాఫ్. ఆ తర్వాత అతడు ఫీల్డింగ్ కొనసాగించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసింది. కానీ ఏదేమైనా రాబోయే 12-24 గంటలకు అతడికి ఎంతో కీలకం. ఏదైనా వాపు వస్తే మాత్రం అతడిని టెస్ట్ లకు పంపాలి. లేదంటే అతడు తమ జట్టు తదుపరి మ్యాచుకు ఫిట్ గా ఉన్నట్టే.

ఈ మ్యాచులో కోహ్లీ 6 బంతుల్లో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఓవర్లో అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో విరాట్.. లాంగ్‌ లెగ్‌లో ప్రసిద్ధ్‌కృష్ణకు చిక్కి ఔట్ అయ్యాడు. మొత్తంగా ఇప్పటివరకు ఈ సీజన్ లో 97 పరుగులు చేశాడు. ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. తొలి మ్యాచులో కేకేఆర్ పై దీన్ని సాధించాడు.

Story first published: Thursday, April 3, 2025, 7:12 [IST]
Other articles published on Apr 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+