
హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై, బెంగుళూరుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చెన్నై దూకుడుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్, డికాక్‌లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడినా లాభం లేకుండాపోయింది. వారి శక్తి మేరకు విజృంభించి ఎనిమిది వికెట్ల నష్టానికి 205పరుగులు చేశారు. ఛేదనకు దిగిన చెన్నై ధోనీ దూకుడుతో విజయం సాధించింది. సిక్సుల మెరుపులతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది.
ఈ ఓటమికే కుంగిపోయిన బెంగళూరు జట్టుకు మరో కష్టం ఎదురైంది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయానికి ఓవర్లు వేయలేకపోవడంతో ఈ జట్టు సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించింది.
'ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ ఓవర్ రేట్ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం' అని ఐపీఎల్ నిర్వాహకులు మీడియాకు లేఖ విడుదల చేశారు.
మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడు వీరోచిత ఇన్నింగ్స్‌లతో చెన్నైకు విజయాన్ని అందించారు. ఆర్‌సీబీకి ఈ టోర్నీలో ఇది నాలుగో పరాజయం. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా ఆర్‌సీబీ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. చెన్నై జట్టు తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఇప్పటికీ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది.