న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన అత్యుత్తమ వన్డే జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

Virat Kohli Named Skipper Of Cricket Australia's ODI Team Of The Year
Virat Kohli finds a special place in Cricket Australias ODI team of the year

హైదరాబాద్: 2018 సంవత్సరానికి గాను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన అత్యుత్తమ వన్డే జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించింది. గడచిన ఏడాదికి క్రికెట్ ఆస్ట్రేలియా 11 మందితో కూడిన అత్యుత్తమ వన్డే జట్టును సోమవారం ప‍్రకటించింది.

<strong>ముంబై ఇండియన్స్‌కు షాక్: ఐపీఎల్ 2019కి బుమ్రా దూరం!</strong>ముంబై ఇండియన్స్‌కు షాక్: ఐపీఎల్ 2019కి బుమ్రా దూరం!

ఈ జట్టులో భారత్ నుంచి కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌లకు చోటు కల్పించింది. అయితే, ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి ఓ ఒక్క ప్లేయర్ కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.

 కోహ్లీ అద్భుత ప్రదర్శన కారణంగానే

కోహ్లీ అద్భుత ప్రదర్శన కారణంగానే

ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, జానీ బెయిర్‌ స్టో(ఇంగ్లండ్‌)లను ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా మూడో స్థానంలో జోరూట్‌, నాలుగో స్థానంలో కోహ్లీని ఎంపిక చేసింది. గతేడాది విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన కారణంగానే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన అత్యుత్తమ జట్టుకు కెప్టెన్‌గా నియమించడానికి ప్రధాన కారణమని ఓ ప్రకటనలో పేర్కొంది.

 14 వన్డేల్లో 1202 పరుగులు చేసిన కోహ్లీ

14 వన్డేల్లో 1202 పరుగులు చేసిన కోహ్లీ

2018లో మొత్తం 14 వన్డేలు ఆడిన కోహ్లీ 133.55 యావరేజితో 1,202 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. గతేడాది వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 160గా ఉంది. ఇక, గతేడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన బూమ్రాను ప్రధాన పేసర్‌గా ఎంపిక చేసింది.

క్రికెట్‌ ఆస్ట్రేలియా అత్యుత్తమ వన్డే జట్టు:

క్రికెట్‌ ఆస్ట్రేలియా అత్యుత్తమ వన్డే జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌, భారత్‌), రోహిత్‌ శర్మ(భారత్‌), బెయిర్‌ స్టో(ఇంగ్లండ్‌), జో రూట్‌(ఇంగ్లండ్‌), హెట్‌మెయిర్‌(వెస్టిండీస్), జాస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌, ఇంగ్లండ్‌), తిషారా పెరీరా(శ్రీలంక), రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్తాన్‌), కుల్దీప్‌ యాదవ్‌(భారత్‌), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌(బంగ్లాదేశ్‌), జస్ప్రీత్ బుమ్రా(భారత్‌)

Story first published: Tuesday, January 1, 2019, 14:20 [IST]
Other articles published on Jan 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X