టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్‌తోనే కాదు.. మైదానంలో తన ఆవేశం వల్ల కూడా బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా మైదానంలో ఇతర జట్ల ప్లేయర్లతో కోహ్లీ పడిన గొడవలు చూస్తే అతని ఆవేశం ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. తాజాగా ఐపీఎల్ 2023లో గంభీర్‌తో కూడా కోహ్లీ గొడవ పడ్డాడు.
ఇవన్నీ కోహ్లీ ఆత్మవిశ్వాసం, ఆవేశానికి నిదర్శనాలు. అంతేకాదు, తన బౌలింగ్ మీద కూడా కోహ్లీకి తెగ నమ్మకం ఉందట. ఈ విషయాన్ని సహచర క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు. ఇటీవల ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న భువీ.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడంటే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ కెరీర్ ఆరంభంలో కోహ్లీ బంతితో కూడా రాణించేవాడు. తను మంచి బౌలర్ అని కోహ్లీకి గట్టి నమ్మకం అని భువనేశ్వర్ చెప్పాడు. దీంతో అతను బంతి తీసుకున్న ప్రతిసారీ తాము టెన్షన్ పడేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు.
'విరాట్ తను బెస్ట్ బౌలర్ అని ఫీల్ అవుతాడు. కానీ అతను బౌలింగ్ చేస్తుంటే మాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే.. తన బౌలింగ్ యాక్షన్ అలాంటిది. ఈ యాక్షన్ వల్ల కోహ్లీ ఎక్కడ గాయపడతాడో?' అని మేం తెగ టెన్షన్ పడేవాళ్లం' అని భువనేశ్వర్ వెల్లడించాడు. కోహ్లీ బౌలింగ్ యాక్షన్ కొంత భిన్నంగాం ఉటుందన్న సంగతి తెలిపిందే.
ఇటీవల ఆసియా కప్ ప్రకటన సమయంలో కూడా జట్టులో ఆల్‌రౌండర్లు లేని సమస్యను విలేకరులు ఎత్తి చూపించారు. దీనికి బదులిచ్చిన రోహిత్.. వరల్డ్ కప్‌లో కోహ్లీ, తను కూడా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. మరి ఇది కేవలం జోక్ మాత్రమేనా? లేదంటే నిజంగానే వరల్డ్ కప్‌లో వీళ్లిద్దరూ? బౌలింగ్ చేస్తారా? లేక ఇదంతా ఫ్యాన్ జస్ట్ జోక్ మాత్రమేనా అని క్లియర్‌గా తెలిదు.