Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పక్కనే అనుష్క ఉంటుంది: భారత్‌కు వచ్చిన డేనియెల్లికి కోహ్లీ ఫ్యాన్స్

Virat Kohli Fans Warn England Woman Cricketer Danielle Wyatt

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం ముంబైలో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మహిళా జట్లు ఆడుతోన్న సంగతి తెలిసిందే. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ మహిళా జట్టులో డేనియెల్లి వాట్‌ కూడా సభ్యురాలిగా ఉంది. 2014లో టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ ప్రదర్శనకు ఫిదా అయిన డేనియెల్లి వాట్‌ ట్విటర్‌ వేదికగా 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో' అని అడిగి అప్పట్లో వార్తల్లో నిలిచింది.

ఆ తర్వాత అదే ఏడాది భారత‌ జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఇరు జట్ల మధ్య ఓ వార్మప్‌ మ్యాచ్‌ జరుగుతుండగా డేనియెల్లి ఆ మ్యాచ్‌కు హాజరైంది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీని కలుసుకున్న సందర్భంలో వ్యాట్‌కు కోహ్లి బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. అనంతరం కోహ్లీతో దిగిన ఫొటోలను, బ్యాట్‌ను చూపిస్తూ అప్పట్లో ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియాలతో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్ కోసం ఇండియాకు వచ్చింది. ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్‌కు ముందు కాస్త ఖాళీ సమయం దొరకడంతో ముంబైలో సైట్‌సీయింగ్ కోసం వెళ్లింది. ఎలిఫెంటా ఐలాండ్‌కు వెళ్తున్నట్లు ట్విట్టర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె ట్వీట్‌ అనంతరం కోహ్లీ అభిమానులు ఆమెకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేశారు.

గతేడాది డిసెంబర్‌లో అనుష్కశర్మ, విరాట్ కోహ్లిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'కోహ్లీ ఇంటికి కొద్ది దూరంలోనే నువ్వు ఉన్నావ్‌... అతడి పక్కన అనుష్క ఉంటుంది జాగ్రత్త' అంటూ ఓ నెటిజన్ సరదాగా ట్వీట్ చేయగా 'మరి కొందరు నువ్వు విరాట్‌ కోహ్లీ ఇంటికి కేవలం 12కిలోమీటర్ల దూరంలోనే ఉన్నావంటూ' సరదాగా ట్వీట్‌ చేశారు.

కాగా, ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌ మహిళలతో తలపడనుంది. టీ20 వరల్డ్‌కప్ సమయంలో కోహ్లీ తనకు గిప్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌తోనే డేనియెల్లి వాట్‌ ఈ ముక్కోణపు టీ20 సిరిస్‌లో చెలరేగాలని ఆమె భావిస్తున్నది. ఇంగ్లాండ్ టీమ్‌లో డేనియెల్లి వాట్‌ ఓపెనిగ్ బ్యాట్స్‌ వుమన్.

Story first published: Thursday, March 22, 2018, 22:00 [IST]
Other articles published on Mar 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+