పాత ఫోన్లతో ఫొటో.. అభిమాని ప్రత్యేక బహుమతికి కోహ్లీ ఫిదా (వీడియో)!!

గువాహటి: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీకి మన దేశంలోనే కాకూండా విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ఇక భారత దేశంలో ఆయనంటే పడిచస్తారు అభిమానులు. ఒక్కో అభిమాని ఒక్కోవిధంగా తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లీపై అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే ఓ అభిమాని ఒంటినిండా టాటూలు వేసుకొని కోహ్లీని ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరో అభిమాని కూడా కోహ్లీని ఫిదా చేసాడు.

పాత ఫోన్లతో ఫొటో:
గవాహటికి చెందిన విరాట్ కోహ్లీ అభిమాని రాహుల్. కోహ్లీ అంటే అతనికి పిచ్చి. దీంతో పాత మొబైల్ ఫోన్లతో కోహ్లీ చిత్రపటం రూపొందించాడు. ఇది చూడడానికి సాధారణ పేపర్‌పై గీసిన బొమ్మలా ఉండడం విశేషం. ప్రస్తుతం కోహ్లీసేన శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 కోసం గువాహటిలో ఉంది. దీంతో అక్కడి హోటల్‌లో కోహ్లీని కలిసిన రాహుల్.. ఆ చిత్రపటాన్ని చూపించాడు. అభిమాని రూపొందించిన తన చిత్రాన్ని చూసి ఫిదా అయ్యాడు.

అత్యుత్తమ క్రియేషన్:
కోహ్లీ ఆ చిత్రంపై తన సైన్ చేశాడు. 'ఇది చాలా అత్యుత్తమ క్రియేషన్. వెల్ డన్. బెస్ట్ విషెస్ ఫ్రమ్ కోహ్లీ' అని రాశాడు. అలాగే రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా విరాట్ రాహుల్‌ను మనస్పూర్తిగా అభినందించాడు. విరాట్ తన అభిమానిని కలిసిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అభిమాని రాహుల్ కోహ్లీపై ఉన్న తన ప్రేమను పంచుకున్నాడు.

అప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది:
అభిమాని మాట్లాడుతూ... 'విరాట్ సర్ అంటే ఎంతో అభిమానం. కొద్ది నెలల క్రితం గువాహటిలో మ్యాచ్ కోసం వస్తున్నాడని తెలిసింది. ఆయన కోసం ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించా. పాత మొబైల్ ఫోన్లు, వైర్లతో చిత్రపటాన్ని రూపొందించాను. ఇందుకోసం నాకు మూడు రోజుల పూర్తి సమయం పట్టింది. కోహ్లీని కలిసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆయన నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు' అని అన్నాడు.
గువాహటిలో తొలి మ్యాచ్:
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలో మరికొద్ది సేపట్లో శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. విజయంతో కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఓపెనర్ శిఖర్ ధావన్, స్పీడ్‌స్టర్ బుమ్రా జట్టులో చేరడంతో టీమిండియా మరింత బలంగా మారింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications